అల్లు అర్జున్ యాడ్ వెంటనే ఆపండి.. హైకోర్టు ఆదేశం

By Surya PrakashFirst Published Dec 5, 2021, 1:56 PM IST
Highlights

 ఆ యాడ్ లో అల్లు అర్జున్ ఓ హోటల్లో దోసెలు వేస్తుంటారు. ఓ వ్యక్తి రాగా, అతడికి బైక్ ట్యాక్సీలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కితే కుర్మా వేసి ఖీమా కొట్టి మసాలా దోసెలా చేసేస్తారని చెబుతారు. 
 


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రాపిడో బైక్ ట్యాక్సీ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. అల్లు అర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం లీగల్ నోటీసులు పంపించింది. ఆ యాడ్ లో అల్లు అర్జున్ ఓ హోటల్లో దోసెలు వేస్తుంటారు. ఓ వ్యక్తి రాగా, అతడికి బైక్ ట్యాక్సీలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కితే కుర్మా వేసి ఖీమా కొట్టి మసాలా దోసెలా చేసేస్తారని చెబుతారు. ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఎక్కాలని అతడిని బన్నీ ప్రోత్సహిస్తారు. ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ బస్సులను, సంస్థ సేవలను కించపరిచేలా యాడ్ ఉందని, ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ విషయమై హై కోర్టు కు వెళ్లారు.  

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల రాపిడో బైక్ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ తో పాటు.. రాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు గానూ..హీరో అల్లు అర్జున్‌, రాపిడో సంస్థకు అధికారులు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్‌ నటించిన రాపిడో ప్రకనటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈ నేపధ్యంలో  రాపిడో సంస్థకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించేలా తీసిన రాపిడో బైక్ రైడ్ ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది. యూ ట్యూబ్‌ లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని హెచ్చరించింది.  మరి కోర్టు ఆదేశాలపై రాపిడో సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

click me!