RRR: ఎన్టీఆర్ కోసం సల్మాన్ ఫెవెరెట్ బ్యూటీ

By Prashanth MFirst Published Apr 12, 2019, 6:55 PM IST
Highlights

ఆలియాతోపాటు డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ మరో హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుంచి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది.  ఈ విషయాన్ని అఫీషియల్ గా డైసీ జోన్స్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆమె ప్లేస్ లోకి ఎవరు రాబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా ఊపందుకున్నాయి.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో హీరోల  పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాతోపాటు డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ మరో హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. 

అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుంచి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది.  ఈ విషయాన్ని అఫీషియల్ గా డైసీ జోన్స్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆమె ప్లేస్ లోకి ఎవరు రాబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా ఊపందుకున్నాయి. తాజాగా శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  

ఇక శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎలాంటి  బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన ఈ సుందరికి ప్రారంభంలో  కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకానొక దశలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది జాక్విలిన్.    ఆ  టైమ్ లో సల్మాన్ భాయ్ ఇచ్చిన ఓ అవకాశం తనను ఆదుకుంది. 

భాయ్ ఎంతో ఆప్తుడిగా తనకు ఎంతో సాయం చేశాడు. కెరీర్ పూర్తిగా డైలమాలో ఉన్నప్పుడు జాక్విలిన్ కి వరుసగా అవకాశాలిచ్చి నిరూపించుకునే అవకాశం కల్పించాడు. కిక్ 2 రేస్ 3 వంటి సీక్వెల్ సినిమాల్లో తనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు సల్మాన్.  అలాగే వరుణ్ ధావన్ సరసన జుడ్వా 2 చిత్రానికి భాయ్ రికమండేషన్ తోనే జాక్విలిన్ అవకాశం అందుకుంది. 

పరిశ్రమలో గాడ్ ఫాదర్ గా నిలిచి ఆదుకున్నాడు భాయ్. ఇప్పుడు కూడా సల్మాన్ రికమెండేషన్ తోనే జాక్విలిన్ ..ఆర్ ఆర్ ఆర్ లోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.  ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి... దానయ్య నిర్మాత. 

వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

click me!