మల్టీస్టారర్ లో నాని డోస్ తక్కువే కానీ..

Published : Apr 12, 2019, 05:32 PM ISTUpdated : Apr 12, 2019, 05:35 PM IST
మల్టీస్టారర్ లో నాని డోస్ తక్కువే కానీ..

సారాంశం

 మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో చేయనున్న మల్టీస్టారర్ లో నాని ఎక్కువ సేపు కనిపించడట. అంటే మరో హీరోగా చేస్తోన్న సుదీర్ బాబుకంటె తక్కువ సేపు తెరపై కనిపిస్తాడని సమాచారం. 

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఆసక్తికరమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జెర్సీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో చేయనున్న మల్టీస్టారర్ లో నాని ఎక్కువ సేపు కనిపించడట. 

అంటే మరో హీరోగా చేస్తోన్న సుదీర్ బాబుకంటె తక్కువ సేపు తెరపై కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా కోసం వ్యూహం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక సినిమాలో నాని క్యారెక్టర్ ఊర మాస్ లో నెగిటివ్ షెడ్ లో ఉంటుందట. ఎప్పుడు కనిపించని విధంగా తెరపై నాని అందరిని ఎట్రాక్ట్ చేస్తాడని తెలుస్తోంది. 

డోస్ తక్కువే అయినా ప్రజెంటేషన్ మాములుగా ఉండదట. అందుకే ఆ పాత్ర కోసం నానిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ గ్యాంగ్ లీడర్ ని కూడా ఫినిష్ చేయాలనీ నాని ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాడు. ఆ సినిమా అయిపోగానే మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నాని ఆలోచిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?