షారుక్ - అమిర్ లతో పోలిస్తే.. కంగారొచ్చేస్తుంది: సల్మాన్

Published : Apr 12, 2019, 06:02 PM ISTUpdated : Apr 12, 2019, 06:06 PM IST
షారుక్ - అమిర్ లతో పోలిస్తే.. కంగారొచ్చేస్తుంది: సల్మాన్

సారాంశం

బాలీవుడ్ లో ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాయాలంటే సల్మాన్ - అమీర్ - షారుక్ లకె సాధ్యం. అయితే ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివరణ ఇచ్చారు.  

ఖాన్ త్రయం మంచిదే కానీ ఆ విషయంలో నేను కంగారుపడే విషయం ఒకటి ఉంది. నేను చేసిన సినిమాల్లో సక్సెస్ లే ఎక్కువ. కమర్షియల్ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. అయితే అమీర్ - షారుక్ లకు ప్లాప్స్ ఉన్నప్పటికీ వారు ఈజీగా సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వారి టాలెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 

నేను మాత్రం ఆ విధంగా సక్సెస్ కొట్టలేను. నేను సాధారణ నటుడిని.  అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల ఫ్యాన్స్ ఎక్కువ ఉండడంతో ఇలా సక్సెస్ అందుకుంటున్నా అని సల్మాన్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ బాక్స్ ఆఫీస్ హీరో భరత్ -  దబాంగ్ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలో ఈ ఏడాది చివర్లో రానున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?
Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు