సొంత తమ్ముడే చంపాలనుకున్నాడు.. కిడ్నీలు దెబ్బ తినడానికి కారణం ఇదే.. నటుడు పొన్నాంబళం ఆవేదన

By Asianet News  |  First Published Mar 16, 2023, 11:58 AM IST

కిడ్నీ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కొలుకున్న నటుడు పొన్నాంబళం తన  అనారోగ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సొంత తమ్ముడే తనపై ప్రయోగం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 


తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు పొన్నాంబళం (Ponnambalam). మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్, రజినీకాంత్ వంటి టాప్ హీరోల చిత్రాల్లో విలన్ గా మెప్పించాడు. 90లలో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే రెండేండ్లుగా పొన్నంబలం ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేకలేదు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. లాంగ్ ట్రీట్ మెంట్ తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కిడ్నీ సమస్య నుంచి ఇటీవలే కోలుకున్న పొన్నాంబళం తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత తమ్ముడే తనను చంపాలని చూశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రక్తసంబంధికులే శత్రువులుగా మారరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మా నాన్నకు నలుగురు భార్యలు. వారిలో మూడో భార్య కొడుకుని నేను బాగా నమ్మాను. ఒకే కడుపులో పుట్టకపోయినా సొంత తమ్ముడిగా భావించాను. అందుకే నా మేనేజర్ గా నియమించాను. కానీ ఆయన మాత్రం నన్నే చంపాలని చూశాడు. ఓసారి నేను తాగే బీర్ లో ‘స్లో పాయిజన్’ విషయాన్ని కలిపాడు. అలాగే ఆహారంలోనూ విషయం కలిపి అందించాడు. అదంతా డబ్బుకోసమే చేశాడు. 

Latest Videos

అయితే, అలా పాయిజన్ కలిపిన మద్యం సేవించడం వల్లనే కిడ్నీలు దెబ్బతిన్నాయి. డాక్టర్స్ ను సంప్రదించడంతో విష ప్రయోగం జరిగిందని, అది కిడ్నీల మీద ప్రభావం చూపిందన్నారు.’ అంటూ భాదాకరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.  2020 జూలైలోనే  పొన్నంబలం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వస్తున్నారు. ఇటీవల కిడ్నీ సమస్య నుంచి కోలుకున్నారు. ఇక తనకు సాయం చేసిన వారికీ ఇంటర్వ్యూలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కష్టసమయంలో ఉన్న తనకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏకంగా రూ.45ల వరకు సాయం చేసి ఆదుకున్నారని తెలిపారు. సాయం అడిగితే రూ.లక్షో.. రెండు లక్షలో ఇస్తారనుకుంటే.. ఏకం ఆస్పత్రి బిల్ మొత్తం ఆయనే చెల్లించి ఆదుకున్నారని తెలిపారు. ఆస్ప్రతి రామ్ చరణ్ సతీమణి ఉపాసన వారిదే కావడం.. చిరంజీవి భరోసాతో తనను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం పొన్నాంబళం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

click me!