షాకింగ్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌

Published : Aug 05, 2020, 12:49 PM ISTUpdated : Aug 05, 2020, 12:53 PM IST
షాకింగ్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌

సారాంశం

సోమవారం సింగర్ సునీత కూడా కరోనా బారిన పడినట్టుగా వెల్లడించారు. తాజాగా లెజెంబరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఎస్పీబీ స్వయంగా ప్రకటించారు.

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో కోరాలు చాస్తోంది. రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇన్నాళ్లు ఉత్తరాదిలో ప్రముఖులకు కరోనా సోకినట్టుగా వార్తలు వస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో ప్రముఖులు కూడా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు.

ఇటీవల దర్శకు ధీరుడు రాజమౌళి తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ప్రకటించటంతో ఇండస్ట్రీ అంతా షాక్‌ అయ్యింది. తరువాత మరో దర్శకుడు తేజ కూడా తనకు పాజిటివ్‌ వచ్చినట్టుగా ప్రకటించారు. సోమవారం సింగర్ సునీత కూడా కరోనా బారిన పడినట్టుగా వెల్లడించారు. తాజాగా లెజెంబరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఎస్పీబీ స్వయంగా ప్రకటించారు.

కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయన్న ఆయన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?