ఎట్టకేలకు ఈడీ ముందుకు జాక్వెలిన్.. రూ.200 కోట్ల చీటింగ్ లో అతడి నుంచి లగ్జరీ కారు, షాకింగ్

By telugu teamFirst Published Oct 20, 2021, 8:45 PM IST
Highlights

 200 కోట్ల స్కామ్ కేసులో అరెస్ట్ అయిన Sukesh Chandrashekhar తో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. 

200 కోట్ల స్కామ్ కేసులో అరెస్ట్ అయిన Sukesh Chandrashekhar తో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎట్టకేలకు జాక్వెలిన్ ఈడీ ముందు నేడు విచారణకు హాజరైంది. ఈ కేసుని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ ఇప్పటికి వరకు నాలుగుసార్లు జాక్వెలిన్ కి సమన్లు జారీ చేయగా ఆమె మూడుసార్లు విచారణకు డుమ్మా కొట్టింది.  

ఆగష్టులో జాక్వెలిన్ తొలిసారి ఈడీ ముందు విచారణకు హాజరైంది. ఆ సమయంలో ఈడీ అధికారులు జాక్వెలిన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత మరో మూడుసార్లు ఈడీ జాక్వెలిన్ కు నోటీసులు పంపింది. కానీ తనకు ముందుగా కమిటైన షూటింగ్స్ ఉన్నాయని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని ఈడీని కోరింది. 

ఈ నెల 16న జాక్వెలిన్ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సింది. కానీ జాక్వెలిన్ హాజరు కాలేదు. కాగా నేడు బుధవారం మధ్యాహ్నం 3. 30 గంటలకు జాక్వెలిన్ విచారణకు హాజరైంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సుఖేష్ చంద్రశేఖర్, అతడి భార్య లీనా పాల్ లతో జాక్వెలిన్ కి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారితో జాక్వెలిన్ ఫోన్ సంభాషణ జరిపినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. 

200 కోట్ల స్కాంలో జాక్వెలిన్ బ్యాంక్ ఖాతాల ద్వారా ఏమైనా లావాదేవీలు జరిగాయా అనే కోణంలో ఈడీ జాక్వెలిన్ ని ప్రశ్నిస్తోంది. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఏమైనా నగదు పొందారా అని ఈడీ జాక్వెలిన్ ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుఖేష్ చంద్ర శేఖర్ ని ఈడీ ప్రశ్నించగా బాలీవుడ్ నటులు జాక్వెలిన్, నోరా ఫతేహి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈడీ విచారణలో సంచలన విషయం బయటకు వచ్చింది. చీటింగ్ చేసిన మనీతో సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్, నోరా ఫతేహి ఇద్దరికీ లగ్జరీ కార్లు కొనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో ఈడీ దర్యాప్తు సాగుతోంది. 

Also Read: మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

తీహార్ జైలులో ఉంటూనే చంద్రశేఖర్ 200 కోట్ల స్కాం కి తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత వారం ఐటెం బ్యూటీ నోరా ఫతేహి కూడా ఈడీ ముందు హాజరైంది. అయితే ఈ కేసులో తాను దోషిని కాదు అని.. బాధితురాలిని అని ఈడీకి చెప్పింది నోరా ఫతేహి. ఎప్పుడు విచారణకు పిలిచినా అధికారులకు సహకరిస్తానని పేర్కొంది. 

Also Read: నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..

ఆగష్టులో పోలీసులు చెన్నైలో సుఖేష్ ఇంటిని, 82 లక్షల నగదుని సీజ్ చేశారు. ఈ కేసులో ఉన్న లింకులన్నీ బయట పెట్టి కీలక ఆధారాలు సేకరించాలని ఈడీ ప్రయత్నిస్తోంది. కాగా నేడు ఈడీ ముందు హాజరైన జాక్వెలిన్ ఎలాంటి సమాధానాలు ఇస్తుందో చూడాలి. 

click me!