జబర్దస్త్ అవినాష్ పెళ్లి... హాజరైన బిగ్ బాస్ సెలబ్రిటీలు!

By team teluguFirst Published Oct 20, 2021, 5:13 PM IST
Highlights

ముక్కు అవినాష్ వివాహానికి బుల్లితెర, వెండితెర సెలెబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. ముఖ్యంగా Bigg boss సెలబ్రిటీలు భానుశ్రీ, రోల్ రైడా పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ వివాహం నేడు ఘనంగా జరిగింది. వధువు అనూజ మెడలో మూడు ముళ్ళు వేసి, ఏడడుగులు నడిచాడు అవినాష్. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో వధూవరులు ఆనందంగా కనిపించారు. ముక్కు అవినాష్ వివాహానికి బుల్లితెర, వెండితెర సెలెబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. ముఖ్యంగా Bigg boss సెలబ్రిటీలు భానుశ్రీ, రోల్ రైడా పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త పెళ్ళికొడుకు అవినాష్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. 


ఇక అవినాష్ కి అత్యంత సన్నిహితురాలైన శ్రీముఖి మెహందీ వేడుకలో పాల్గొనడం జరిగింది. ప్రియమిత్రుడు అవినాష్ తో పాటు మెహందీ అలంకరించుకొని, తన ఆనందం వ్యక్తం చేశారు Sreemukhi. ఆగష్టు 31వ తేదీన అవినాష్ తన పెళ్లి ప్రకటన చేశారు. అనూజ అనే యువతితో తనకు నిశితార్థం అయినట్లు ప్రకటించారు. అలాగే నిశితార్ధ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిశితార్థం జరిగిన 50రోజుల తరువాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. అవినాష్ పెళ్ళికి ప్రత్యక్షంగా హాజరుకాని స్నేహితులు సోషల్ మీడియాలో విషెష్ తెలియజేస్తున్నారు. 


చాలా ఏళ్ళు Jabardasth లో కమెడియన్ గా చేశారు అవినాష్. కెవ్వు కార్తీక్ తో పాటు ఆయన టీమ్ లీడర్ కూడా అయ్యారు. గత ఏడాది అవినాష్ కి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడం జరిగింది. జబర్దస్త్ కాంట్రాక్టు బ్రేక్ చేసి రూ. 10 లక్షలు చెల్లించి అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన గేమ్ తో అవినాష్ చివరి ఎపిసోడ్స్ వరకు కొనసాగారు. ఫైనల్ కి రెండు వారాల ముందు అవినాష్ ఎలిమినేట్ కావడం జరిగింది.

 Also read అవినాష్ మెహందీ వేడుకలో యాంకర్ శ్రీముఖి సందడి... వైరల్ గా ఫోటోలు
హౌస్ నుండి బయటికి వచ్చాక, స్టార్ మా ఆయనకు మరో ఆఫర్ ఇచ్చింది. ఆ ఛానల్ లో కొత్తగా ప్రారంభించిన స్టార్ కమెడియన్స్ షోలో ఓ టీమ్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అవినాష్ కామెడీ స్టార్స్ షోలో కొనసాగుతున్నారు. 

Aslo read సోహైల్‌-అరియానాలను మించిపోతున్న సన్నీ-ప్రియాల ఫైటింగ్‌.. చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌..

click me!