మరోసారి ఫార్ములా చేంజ్ చేసిన అల్లరి నరేష్, ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం ఫస్ట్ లుక్ రిలీజ్

Published : May 10, 2022, 01:14 PM IST
మరోసారి ఫార్ములా చేంజ్ చేసిన అల్లరి నరేష్, ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం ఫస్ట్ లుక్ రిలీజ్

సారాంశం

ఎప్పటికప్పుడు తన సినిమాల ఫార్ములా మార్చుకుంటూ వస్తున్నాడు అల్లరి నరేష్. కామెడీ హీరోగా ఎంటర్ అయ్యి చాలా కాలం వరుస సినిమాలు దున్నేసిన యంగ్ స్టార్.. ఆతరువాత డల్ అయ్యాడు. ఫార్ములా మార్చి సీరియన్ పాత్రలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సారి డిఫరెంట్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.   

కామెడీ అంటే అల్లరి నరేష్... అల్లరి నరేస్ అంటే కామెడీ.. కామెడీలో కూడా హీరోయిజం మిక్స్ చేసి కడుపుబ్బా నవ్వించడంలో  నరేష్ సక్సెస్ అయ్యాడు. కాని గ‌త‌కొంత కాలంగా  అల్లరి నరేష్  సినిమాలు ఆకట్టుకోకపోవడం, ఒకే పంతాలో ఉండ‌టంతో ప్రేక్ష‌కులు న‌రేష్ సినిమాల‌ను థియేట‌ర్ల‌లో చూడ‌టానికి అంత‌గా ఆస‌క్తి చూప‌డంలేదు. దాంతో న‌రేష్ రోటీన్‌కు భిన్నంగా  ఆలోచించడం మొదలు పెట్టాడు. 

సినీయ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ త‌ర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేష్‌. ఏడాదికి రెండు మూడు సినిమాల‌ను చేస్తూ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించేవాడు. డైరెక్టర్ కు కాని.. నిర్మాతకు కాని కామెడీ జోన‌ర్‌లో సినిమా చేయాలంటే మొద‌ట గుర్తొచ్చే పేరు అల్ల‌రి న‌రేష్‌. అంత‌లా ఈయ‌న త‌న న‌ట‌న‌, కామెడీ టైమింగ్‌తో రెండు గంట‌లు హాయిగా న‌వ్వుకునేలా చేస్తాడు. అటువంటిది.. కొంత కాలానికి నరేష్   సినిమాలు బోర్ కొట్టడంతో ఫార్ములా మర్చేశాడు హీరో. 

ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ నాంది సినిమాతో సీరియస్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అల్లరి నరేష్.  కామెడీని ప‌క్క‌న పెట్టి మొద‌టి సారి పూర్తి స్థాయిలో న‌రేష్ సీరియస్ పాత్రలో కనిపించాడు. ఈసినిమాతో న‌రేష్ న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అంతేకాదు నాంది సినిమాతో చాలా కాలం తరువాత  అల్ల‌రి న‌రేష్‌కు మంచి బ్రేక్ కూడా వచ్చింది. 

ఇక ఇప్పుడు మరో సారి  న‌రేష్ అదే ఫార్ములాను ఉపయోగించబోతున్నాడు.  మ‌రో సిరీయ‌స్ పాత్ర‌లో  ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం అనే సినిమాను చేస్తున్నాడు. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను గ‌త నెల‌లో మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టైటిల్ పోస్ట‌ర్‌తోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు మేకర్స్.. ఇక ఇప్పుడు  ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ తో మరోసారి సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచారు. 

 

రీసెంట్ గా ఈమూవీలో నుంచి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.  ఈ పోస్ట‌ర్‌లో న‌రేష్ మంచం కాలు ప‌ట్టుకుని ఎవ‌ర్నో కోల్పోయిన‌ట్టు బాధ‌తో చూస్తున్న‌ట్లు ఉంది. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే నాంది త‌ర‌హాలో మ‌రో ఫుల్ లెంగ్త్ సీరియ‌స్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. న‌రేష్‌కు జోడీగా బ‌స్‌స్టాప్ ఫేం ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమాలో అల్ల‌రిన‌రేష్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా