యంగ్ హీరోలకు షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఫాదర్ రిలీజ్ అప్పుడేనట...?

By Mahesh Jujjuri  |  First Published May 10, 2022, 12:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలను భయపెడుతున్నారు. అసలే కరోనా.. ఆపైన పెద్ద సినిమాల దండయాత్ర ఈమధ్యలోచిన్న సినిమాలు ఏదో ఒక టైమ్ చూసుకుని రావాలి అనుకుంటే.. అప్పుడు కూడా స్టార్ హీరోల కింద నలిగిపోతున్నామంటున్నారు యంగ్ స్టార్స్. 


మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలను భయపెడుతున్నారు. అసలే కరోనా.. ఆపైన పెద్ద సినిమాల దండయాత్ర ఈమధ్యలోచిన్న సినిమాలు ఏదో ఒక టైమ్ చూసుకుని రావాలి అనుకుంటే.. అప్పుడు కూడా స్టార్ హీరోల కింద నలిగిపోతున్నామంటున్నారు యంగ్ స్టార్స్. 

పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి అంటే చిన్న సినిమాలు థియేటర్లకు రావడానికి భయపడతాయి. అసలు వారు రిలీజ్ చేయడానికి థియేటర్లు కూడా దొరుకుతాయి అన్న నమ్మకం ఉందడు. ఇక దాంతో ఏం చేయాలో తెలియక.. రెండు పెద్ద సినిమాల మధ్యలో గ్యాప్ చూసుకుని తమ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు చిన్న హీరోలు మరి ఈ డేట్స్ ను కూడా పెద్ద సినిమాలు తన్నుకుపోతే...? 

Latest Videos

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజ డౌరెక్షన్ లో  తెరకెక్కుతోన్న సినిమా గాడ్ ఫాదర్. మోహన్ లాల్ హీరోగా రూపొందిన మలయాళ లూసిఫర్ కి ఇది రీమేక్. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారితో కలిసి చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం తో పాటు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈసినిమాలో గెస్ట్ రోల్ లో మెరిపించబోతున్నాడు. అంతే కాదు  నయనతార .. సత్యదేవ్ లాంటి వారు  ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మెగా అభిమానులంతా  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు రిలీజ్ పై లీకులు కూడా ఇస్తున్నారు టీమ్. 

ఫ్యాన్  వేయికళ్లతో వెయిట్ చేస్తున్న ఈసినిమాను ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో దింపాలనే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా కంటెంట్ పరంగా ఈ సినిమా ఆగస్టు 15 నాటికి థియేటర్లలో ఉండేలా చూడాలని భావించారట. అందువల్లనే ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం. కాని అదే రోజున రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుని చాలా సినిమాలు బిందాస్ గా ఉన్నాయి. వారికి  షాక్ తగిలినట్టయింది. 

ఇక ఇదే రోజున టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో  సమంత,అఖిల్ , నితిన్  సినిమాలు ఉన్నాయి. కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడ్డ ఈ యంగ్ స్టార్స్.. పెద్ద సినిమాలకు అడ్డు లేకుండా.. తమ రిలీజ్ ను  ఫిక్స్ చేసుకున్నారు. మరి ఆ డేట్ ను కూడా మెగాస్టార్ తీసుకెళ్ళిపోతుండటంతో అందరూ ఆలోచనలో పడ్డారు.
అయితే ఈసినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. మరి అనౌన్స్ మెంట్ తరువాత చిన్న హీరోలు ఏ నిర్ణయం తీసుకుటారో చూడాలి. 
 

click me!