బ్రో మూవీలో ఐటెం సాంగ్... పరిశీలనలో ఆ ఇద్దరు హీరోయిన్స్!

Published : May 22, 2023, 10:33 AM IST
బ్రో మూవీలో ఐటెం సాంగ్... పరిశీలనలో ఆ ఇద్దరు హీరోయిన్స్!

సారాంశం

బ్రో మూవీ షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.   

పవన్ కళ్యాణ్ మరోసారి భగవంతుడు అవతారం ఎత్తనున్నాడు. బ్రో చిత్రంలో ఆయన మోడ్రెన్ గాడ్ గా అలరించనున్నాడు. వినోదయ సితం రీమేక్ గా బ్రో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందట. దీని కోసం శృతి హాసన్, దిశా పటాని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరిలో ఒకరు బ్రో చిత్రంలో ఐటమ్ నంబర్ చేయనున్నారట. 

పవన్ కళ్యాణ్ చేసే రీమేక్స్ ఒరిజినల్స్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటాయి. పింక్, అయ్యప్పనుమ్ కోశియుమ్ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా కమర్షియల్ చిత్రాలుగా మార్చేసిన ఘనత ఆయన సొంతం. వినోదయ సితం వంటి మూవీలో కూడా ఐటెం సాంగ్ పెడుతున్నారంటే ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా పవన్ ఫ్యాన్స్ కి కావల్సినది ఇచ్చేయాల్సిందే. 

మరి ఈ ఐటెం సాంగ్ లో భక్తుడైన సాయి ధరమ్ తేజ్ డాన్స్ చేస్తాడో భగవంతుడైన పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తాడో చూడాలి. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని బ్రో తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌