హీరో వెంకటేష్ ఇంటిపై ఐటీ అధికారుల అటాక్.. ఈరోజంతా కొనసాగే అవకాశం!

Published : Nov 20, 2019, 01:45 PM ISTUpdated : Nov 21, 2019, 12:47 PM IST
హీరో వెంకటేష్ ఇంటిపై ఐటీ అధికారుల అటాక్.. ఈరోజంతా కొనసాగే అవకాశం!

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమపై ఐటీ అధికారులు పంజా విసిరారు. బుధవారం రోజు అకస్మాత్తుగా పలువురు టాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు టార్గెట్ గా ఐటీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. 

తెలుగు చిత్ర పరిశ్రమపై ఐటీ అధికారులు పంజా విసిరారు. బుధవారం రోజు అకస్మాత్తుగా పలువురు టాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు టార్గెట్ గా ఐటీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. 

మొదటగా రామానాయుడు స్టూడియోలో ఐటి అధికారుల దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత సురేష్ బాబు నివాసం, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో కూడా ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహించారు. తాజాగా సురేష్ బాబు సోదరుడు, సినీ హీరో వెంకటేష్ నివాసంలో కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

బ్రేకింగ్: రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు!

కొంతమంది ఆడిటర్లని వెంటపెట్టుకుని పలు పత్రాలని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హీరో నాని నివాసం, హారిక అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం వరకు ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నాని, త్రివిక్రమ్ సన్నిహిత ప్రొడక్షన్ హౌస్ పై ఐటీ దాడులు.. టాలీవుడ్ కు వరుస షాక్ లు!

గతంలో కూడా పలు సందర్భాల్లో టాలీవుడ్ ప్రముఖులపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు దాడులు నిర్వహించారు. కానీ ఇంతలా ఒక్కసారిగా పలువురు ప్రముఖుల్ని టార్గెట్ చేయడం జరగలేదు. మొత్తంగా నేడు జరుగుతున్న ఐటీ సోదాలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?