బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు

Published : Nov 11, 2016, 12:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు

సారాంశం

బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఇళ్లు కార్యాలయాలపై ఏకకాలంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరవై మంది టీమ్ తో కూడిన ఐటీ అధికారుల బృందం ఏకకాలంలో ఆర్క మీడియా కార్యాలయం, శోభు, ప్రసాద్ ల ఇళ్లు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు వంద కోట్ల పెట్టుబడితో నిర్మించిన బాహుబలి చిత్రం 650 కోట్లల రూపాయల బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్లు నమోదు చేసింది.

ఈ మూవీ కలెక్షన్లు ఒకవైపు, మరో వైపు దాదాపు 200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 500 కోట్లు దాటిన నేపథ్యంలో... ఐటీ అధికారుల నిఘా బాహుబలి నిర్మాతలపై పడింది. ఇరువురు నిర్మాతల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రధానంగా 500,1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేయడంతో బాహుబలి నిర్మాతలు తమ దగ్గర భారీ ఎత్తున నిల్వ ఉన్న నల్లధనాన్ని ఏజెంట్ల ద్వారా వైట్ మనీగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. బడా సినీ నిర్మాతల కార్యకలాపాలపై నిఘా పెంచిన ఐటీ విభాగం పక్కా ప్లాన్ తో బాహుబలి చిత్రం నిర్మాతల కార్యాలయాలు, ఇండ్లపై ఏకకాలంలో సోదాలకు రంగంలోకి దిగింది.

బాహుబలి చిత్ర నిర్మాతల కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో బ్లాక్ మనీ దాచిపెట్టిన బడా నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే నిర్మాతలు, బడా హీరోలు.. కొంత మంది ఏజెంట్లను నియమించుకుని... అవసరమైతే ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాకు సైతం నగదును బదిలీ చేస్తున్నారని సమాచారం. సమయం తక్కువ ఉండటంతో ఆయా పనుల్లో.. అంటే నోట్లు మార్చే పనిలో బిజీగా ఉన్న సినీ ప్రముఖులకు ఇప్పుడు ఐటీ దాడుల రూపంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది పరిస్థితి.

గతంలో కూడా దిల్ రాజు, బండ్ల గణేష్ లాంటి టాలీవుడ్ నిర్మాతలపైనా ఐటీ దాడులు జరిగాయి. పూరీ, మహేష్ బాబులు బిజినెస్ మెన్ సినిమా సమయంలో ఐటీ దాడులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేక సందర్భం. అసలేల నోట్లు మార్చుకోవడం ఎలారా బాబూ అని ఆలోచిస్తున్న బడా నిర్మాతలు,హీరోలకు ఐటీ దాడులు షాక్ ఇస్తున్నాయి. మరి ఐటీ శాఖ ఏం లెక్క తేలుస్తుందో... నిర్మాతలు ఏమేరకు తము నోట్లు మార్చే దిశగా తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

'పెళ్లి చేసుకోవడానికి వయస్సు ఉంటే సరిపోదు.. కావాల్సింది అదే'..
Anchor Rashmi కొత్త కండీషన్స్.. ఈ విషయంలో అందరికి అనుమతి లేదంట