ముగిసిన మహర్షి బాక్సాఫీస్ రన్.. లాభాల లెక్క ఇదీ!

Published : Jul 04, 2019, 06:20 PM IST
ముగిసిన మహర్షి బాక్సాఫీస్ రన్.. లాభాల లెక్క ఇదీ!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 

మహేష్ బాబు కార్పొరేట్ సంస్థ అధినేతగా, స్టూడెంట్ గా మెప్పించాడు. ఈ చిత్రంలోని రైతు సమస్యల అంశం అందరిని ఆకట్టుకుంది. సమ్మర్ సీజన్ కూడా తోడవడంతో వసూళ్ల వర్షం కురిసింది. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మహర్షి చిత్రానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ ప్రకారం 101 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలి. ఓవరాల్ గా మహర్షి చిత్రం థియేట్రికల్ రన్ లో 3.5 కోట్ల లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. సీడెడ్ లో మాత్రం ఆశించిన మేరకు ఈ చిత్రం రాణించలేదు. 

శాటిలైట్ రైట్స్, డబ్బింగ్, డిజిటిల్ రైట్స్ లో నిర్మాతలకు మంచి లాభాలే దక్కాయి. ప్రస్తుతం మహేష్ బాబు కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రారంభమైంది. 

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్