తానా మహా సభలు: పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఉత్కంఠ!

By tirumala ANFirst Published Jul 4, 2019, 6:53 PM IST
Highlights

అమెరికాలోని ప్రవాస తెలుగు వారు రెండేళ్లకోసారి తానా మహా సభలు నిర్వహిస్తున్నారు. జులై 4 నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో 22వ తానా సభలు జరగనున్నాయి.

అమెరికాలోని ప్రవాస తెలుగు వారు రెండేళ్లకోసారి తానా మహా సభలు నిర్వహిస్తున్నారు. జులై 4 నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో 22వ తానా సభలు జరగనున్నాయి. అమెరికాలోని తెలుగు ఎన్నారైలు ఘనంగా నిర్వహించే ఈ వేడుకలు సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఇతర ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా తానా నుంచి ఆహ్వానం అందింది. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి,తమన్, పూజా హెగ్డే తానా సభల్లో మెరవనున్నారు. 

ఇక మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సభల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రసంగం చేస్తారో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే మొదటి సభ ఇదే. ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. పార్టీని నడిపించే విషయమై తన ప్రసంగంలో పూర్తి క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు. 

click me!