
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన బ్యానర్‌లో క్రేజీ మూవీస్‌ని నిర్మించడమే కాదు, ఇతర భాషల్లో మంచి విజయాలు సాధించిన చిత్రాలను తెలుగులో విడుదల చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. సక్సెస్‌లో భాగమవుతున్నారు. `కాంతార` విషయంలో అదేజరిగింది. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు. తమిళంలో ఇటీవల విడుదలైన సంచలన విజయం సాధించింది `విడుతలై పార్ట్ 1` చిత్రాన్ని తెలుగులో డబ్ చేయబోతున్నారు.
తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా సినిమాలను విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో మరో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో సక్సెస్ సాధించిన `విడుదలై పార్ట్ 1` చిత్రాన్ని తెలుగులోకి తీసుకురాబోతున్నారు. మావెరిక్ ఫిల్మ్ మేకర్ వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన చిత్రం `విడుతలై పార్ట్ 1`. ఈ పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 31న తమిళనాడు అంతటా, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అక్కడ విశేష స్పందన లభించింది.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి కథానాయకులుగా నటించారు. థియేటర్లలో విడుదలయ్యాక, ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దక్షిణ-భారత చలనచిత్రాలు అన్ని భాషల ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఒక మంచి సినిమాను ఆదరిస్తారు. ఇదివరకే "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజైన `కాంతార`, `మాలికాపురం` వంటి సినిమాలకు విశేష ఆదరణ దక్కింది. అందులో భాగంగానే ఇప్పుడు `విడుతలై పార్ట్ 1` కోసం కూడా మన తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంచి కంటెంట్‌ని తెలుగు ఆడియెన్స్ కి అందించాలనే లక్ష్యంతో నిర్మాత అల్లు అరవింద్ `విడుతలై పార్ట్ 1` సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తానేది క్లారిటీ రావాల్సింది. `కాంతార `తో మంచి విజయాన్ని అందుకున్న "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" అలానే `విడుతలై`తో కూడా అదే విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు. ఉత్కంఠ రేపుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RS ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు. లెజెండరీ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే సహ రచయిత అయిన బి జయమోహన్ తునైవన్ ఆధారంగా రూపొందించబడింది.