ఎన్టీఆర్ ఇందులో దేవ్-వరగా తండ్రి, కొడుకులుగా కనిపిస్తారంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు లాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) చేస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ దేవర(Devara) ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(Shiva Koratala) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అంటే సరిగ్గా రిలీజ్ కు నెల రోజులలోపే దేవర థియేటర్స్ లో దిగనున్నారన్నారన్నమాట.
ఈ నేపధ్యంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా? లేదా అనే సందేహాలు మొదలు అయ్యాయి. ఎన్టీఆర్ ఇందులో దేవ్-వరగా తండ్రి, కొడుకులుగా కనిపిస్తారంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు లాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ గా టీమ్ ఇప్పటిదాకా ఏదీ ఖరారు చేయలేదు. కానీ ఇందులో డ్యూయర్ రోల్ ఏమీ లేదని, కేవలం రెండు విభిన్నమైన గెటప్ లలో మాత్రమే కనిపిస్తారు ఎన్టీఆర్ అని ఇండస్ట్రీలోని కొందరు తేల్చి చెప్తన్నారు.
అందుతున్న సమాచారం మేరకు దేవరలో ఎన్టీఆర్ రెండు లుక్స్‌లో కనిపించనున్నాడని, ఆయనకు ద్విపాత్రాభినయం లేదని చెప్తున్నారు. సినిమా వేర్వేరు సమయాల్లో జరిగేలా రెండు లుక్స్‌లో కనిపించనున్నాడని , స్క్రీన్ ప్లే తో కొరటాల మ్యాజిక్ చేయబోతున్నారట. రీసెంట్ గా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ లో ఎన్టీఆర్ రెండు రకాల షేడ్స్తో ఉండటంతో ఈ విషయమై చర్చ మొదలైంది.
ఇక దేవర సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ.. వినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుందని చెప్తున్నారు. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.130 కోట్ల బిజినెస్ జరుగుతుందట దేవర సినిమాపై. ఇక మిగతా భాషల్లో కలిపి రూ.50 నుండి 60 కోట్ల బిజినెస్ చేస్తుండగా.. ఓవర్ సీస్ రైట్స్ రూ.27 కోట్లు, ఆడియో రైట్స్ రూ. 33 కోట్లు, ఓటీటీ రైట్స్ రూ.155 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇలా రిలీజ్ కు ముందే అన్ని లెక్కలు కలుపుకొని దాదాపు రూ.400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.