పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్ వివాదం... సంచలనంగా పూనమ్ కౌర్ పోస్ట్!

By Sambi Reddy  |  First Published Aug 29, 2024, 6:58 AM IST

సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతూ ఉంటుంది పూనమ్ కౌర్. పవన్ కళ్యాణ్ ని పై ఆమె పరోక్షంగా విమర్శలు చేస్తుంది. పవన్-బన్నీ మధ్య వివాదం నడుస్తుండగా పూనమ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.. 
 


మెగా హీరోలతో అల్లు అర్జున్ వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. మొన్నటి వరకు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలకు తెరలేపుతున్నారు. పవన్ కళ్యాణ్ పుష్ప మూవీ పై ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశాడు. ఒకప్పుడు హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే రోల్స్ చేస్తున్నారని, అసహనం వ్యక్తం చేశాడు. 

పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి స్పందించాడు. పవన్ కళ్యాణ్ అలా అనడం సరికాదు. అల్లు అర్జున్ సినిమాలో స్మగ్లింగ్ చేశాడు. నిజ జీవితంలో కాదు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడని గుర్తు చేశాడు. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హీరో అల్లు అర్జున్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు. మెగా హీరోల ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని కూడా ఆదరించారు. నువ్వేమైనా పుడింగివా అంటూ విమర్శల దాడికి దిగారు. 

Love , prayers and harmony ❤️🫶🙏 pic.twitter.com/6kYhDwUw1k

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal)

Latest Videos

ఈ పరిణామాల నేపథ్యంలో మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందని స్పష్టం అవుతుంది. ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగా... హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డితో ఉన్న ఫోటోను పూనమ్ కౌర్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రేమ, ప్రార్ధనలు, శాంతి... అని ఆ ఫోటోకి కామెంట్ జోడించింది. పూనమ్ కౌర్ ఈ పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది. 

పూనమ్ కౌర్ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆమె తరచుగా పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుంది. వీరిద్దరి పై పలుమార్లు సోషల్ మీడియా వేదికగా పూనమ్ కౌర్ మండిపడింది. త్రివిక్రమ్ ని అయితే డైరెక్ట్ గా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై పూనమ్ కౌర్ కి ఎందుకు కోపం అనేది తెలియదు. ఆమె ఎప్పుడూ బయటపెట్టలేదు. 

click me!