మెగాస్టార్ పక్కన అంటే మరీ మనమరాలులా ఉంటుందేమో..!

Published : Apr 05, 2019, 09:23 AM IST
మెగాస్టార్ పక్కన అంటే మరీ మనమరాలులా ఉంటుందేమో..!

సారాంశం

ఓ జనరేషన్ హీరోలకు తమ ప్రక్కన నటించే హీరోయిన్స్ సమస్య వస్తోన్న సంగతి తెలిసిందే. 

ఓ జనరేషన్ హీరోలకు తమ ప్రక్కన నటించే హీరోయిన్స్ సమస్య వస్తోన్న సంగతి తెలిసిందే. కొంచెం యంగ్ హీరోయిన్స్ తీసుకుంటే పెయిర్ బాగుండటం లేదు. అలాగని ముదురు భామలను ప్రక్కన పెట్టుకుంటే కుర్రకారు ఆ సినిమాల వైపు చూడరు. దాంతో ఎవరిని తమ ప్రక్కన తీసుకోవాలనేది ప్రతీ సినిమా ముందు సీనియర్ హీరోలకు పెద్ద సమస్యగా మారిపోయింది. చిరంజీవి కు సైతం గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నారు. 

త్రిష సైతం ఆయన ముందు చిన్న పిల్లలా కనపడిందని విమర్శలు వచ్చాయి.   చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించాలంటే ఆ ఏజ్ కు మ్యాచ్ అయ్యే హీరోయిన్ ఉండాలి. లేకపోతే  సమస్య వస్తుందని దర్శక,నిర్మాతలు ఆచి,తూచి నిర్ణయం తీసుకుంటారు ఆ విషయంలో .

ప్రస్తుతం చిరంజీవి జపాన్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన వచ్చాక ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్  పూర్తి చేస్తారు. ఇదిలా ఉంటే మరో ప్రక్క ఆయన తన తదుపరి చిత్రానికి కథ, డైరక్టర్ ని ఫైనలైజ్ చేసేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందబోతోంది. 

ఆ సినిమాలో హీరోయిన్ గా ఆయన ప్రక్కన కీర్తి సురేష్ అయితే బాగుంటుందని కొరటాల శివ భావించి ఎప్రోచ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి ఏజ్ కు కీర్తి సురేష్ ప్రక్కన ఉంటే మనమరాలిలా ఉంటుందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. మరి కొరటాల శివ ఈ విషయమై ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ