మజిలీ యూఎస్ ప్రీమియర్ షో టాక్

Published : Apr 05, 2019, 05:26 AM IST
మజిలీ యూఎస్ ప్రీమియర్ షో టాక్

సారాంశం

ఒక  భార్య ప్రేమ ఎంత గొప్పదో దర్శకుడు శివ నిర్వాణ మజిలీ సినిమాతో చాలా క్లారిటీగా చెప్పేశాడు. మధ్యతరగతి జీవితాన్ని సర్దుకుపోవడంలో ఒక తెలివైన ఇల్లాలు పడే తపన ఏమిటో తనదైన శైలిలో గుండెలకు హత్తుకునేలా ప్రజెంట్ చేశారు.

ఒక  భార్య ప్రేమ ఎంత గొప్పదో దర్శకుడు శివ నిర్వాణ మజిలీ సినిమాతో చాలా క్లారిటీగా చెప్పేశాడు. మధ్యతరగతి జీవితాన్ని సర్దుకుపోవడంలో ఒక తెలివైన ఇల్లాలు పడే తపన ఏమిటో తనదైన శైలిలో గుండెలకు హత్తుకునేలా ప్రజెంట్ చేశారు. నాగ చైతన్య - సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

అయితే యూఎస్ లో సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ను తెలుగు ప్రవాసులు చూసేశారు. ఆ టాక్ విషయానికి వస్తే.. మెయిన్ గా సమంత తన నటనతో మరో మెట్టు పైకి ఎక్కేసింది. ఇక నాగ చైతన్య ఎప్పుడు లేని విధంగా యాంగ్రీ యాటిట్యూడ్, లవ్ ఫెయిల్యూర్ గా తెరపై ఆకట్టుకున్నాడు.  సమంత అతని జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో ప్రధానమైన పాయింట్.

 ప్రేమలో విఫలమై గాయపడిన భర్తను సర్దుకోపోవడంలో సమంత కనబరిచిన అమాయకత్వం చాలా బావుంది. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా చైతు సమంత ద్వారా మరో హిట్టు కొట్టడం కాయమని టాక్ వస్తోంది. మరి మిడిల్ క్లాస్ జనాలకు బాగా దగ్గరగా ఉన్న ఈ కథ తెలుగు జనాలను ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

అప్పుడు జబర్దస్త్‌లో చేరమని పదేపదే కోరారు.. కానీ.! ఆ తర్వాత జరిగిందిదే: బలగం వేణు
అకీరా నందన్ డీప్‌ఫేక్ వీడియో, పవన్ కళ్యాణ్ తనయుడికి తప్పని తిప్పలు, కోర్టును ఆశ్రయించిన స్టార్ కిడ్