Anushka Shetty: అనుష్క కావాలనే బరువు పెరిగిందా? ఆ వీడియోతో పిచ్చ క్లారిటీ!

By Sambi ReddyFirst Published Mar 22, 2023, 5:04 PM IST
Highlights


అనుష్క శెట్టి ఈ మధ్య మరింత బరువు పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఓ కారణంతోనే ఆమె లావనయ్యారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.
 

ఓ కళాఖండం కోసం ప్రయోగం చేసి లావైంది అనుష్క శెట్టి. కే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి సైజ్ జీరో టైటిల్ తో సోషల్ సెటైరికల్ డ్రామా తెరకెక్కించారు. ఈ మూవీలో అనుష్క ఫ్యాట్ గర్ల్ గా కనిపించారు. పాత్రలో సహజత్వం కోసం నిజంగానే భారీగా బరువు పెరిగారు. రాఘవేంద్రరావుతో ఉన్న సన్నిహిత సంబంధాలు రీత్యా ఈ సాహసం చేశారు. ఇంత రిస్క్ చేస్తే... సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. సినిమా పోయింది. అనుష్క మాత్రం లావుగా మిగిలిపోయింది. 

పరిమితికి మించి బరువెక్కడం వలన ఎంత కష్టపడ్డా అనుష్క మునుపటి షేప్ కి రాలేదు. బాహుబలి 2 కి ఆమె లుక్ తలనొప్పిగా మారింది. చేసేది లేక రాజమౌళి గ్రాఫిక్స్ లో ఆమెను నాజూగ్గా చూపించే ప్రయత్నం చేశారు. అనుష్క దీక్షతో కొంచెం సన్నబడ్డారు కానీ స్లిమ్ షేప్ కి రాలేదు. ఆమె సినిమాలు కూడా తగ్గించేయడంతో అనుష్క ప్రస్తుతం ఎలా ఉన్నారనేది అభిమానులకు ఐడియా లేకుండా పోయింది. మహాశివరాత్రికి అనుష్క కేరళ వెళ్లారు. 

మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అనుష్క ఫోటోలు బయటకు రాగా చూసిన జనాలు షాక్. ఆమె జీరో సైజ్ సినిమాలో లుక్ కి దగ్గరగా కనిపించారు. అసలు సినిమాలు చేసే ఆలోచన లేదా? ఇంత బరువైపోయారేంటని? చర్చ నడిచింది. అయితే అనుష్క ఇలా మారడం వెనుక రీజన్ ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  కోసం ఆమె మరలా బరువెక్కి ఉండొచ్చనే వాదన మొదలైంది. 

ఉగాది కానుకగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ నుండి 'నో నో నో' సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ లో అనుష్క శెట్టిని చూశాక కారణంతోనే ఆమె బరువు పెరిగి ఉండొచ్చంటున్నారు. ఇది ఓ ఏజ్ బార్ లేడీ యంగ్ ఫెలో మధ్య నడిచే రొమాంటిక్ డ్రామా అట. కాబట్టి అనుష్క బొద్దుగా తయారై ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... అనుష్క ఎలా ఉండా చూస్తారు. ఆమెకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది మరి. 
 

click me!