ఆడియెన్స్ కి షాక్‌ ఇచ్చిన థియేటర్‌.. `ధమ్కీ`కి బదులు `ధమాకా` ప్రదర్శన.. ఆడియెన్స్ గోల..

Published : Mar 22, 2023, 04:29 PM ISTUpdated : Mar 22, 2023, 04:30 PM IST
ఆడియెన్స్ కి షాక్‌ ఇచ్చిన థియేటర్‌.. `ధమ్కీ`కి బదులు `ధమాకా` ప్రదర్శన.. ఆడియెన్స్ గోల..

సారాంశం

`ధమ్కీ` సినిమా చూసేందుకు వచ్చిన ఆడియెన్స్ కి పెద్ద షాకిచ్చింది థియేటర్ సిబ్బంది. ఆ సినిమాకి మరో సినిమా ప్రదర్శించడం ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్ అవుతుంది.

ఓ థియేటర్‌ యాజమాన్యం ఆడియెన్స్ కి పెద్ద షాకిచ్చారు. `ధమ్కీ` ఆడియెన్స్ కి `ధమాకా` సినిమా చూపించాడు. ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన చిత్రం `దాస్‌ కా ధమ్కీ`. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. నివేతా పేతురాజ్‌ హీరోయిన్‌గా  నటించింది. ఈ చిత్రం నేడు ఉగాది సందర్భంగా బుధవారం(మార్చి 22)న విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. 

ఇదిలా ఉంటే ఓ థియేటర్లో `ధమ్కీ` సినిమా కోసం వచ్చిన ఆడియెన్స్ కి పెద్ద షాక్‌ ఎదురైంది. `ధమ్కీ` కోసం వస్తే, `ధమాకా` చూపించడంతో షాక్‌ అయ్యారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వైజాగ్‌లోని సుకన్య థియేటర్ ల `ధమ్కీ`కి బదులు `ధమాకా` చిత్రాన్ని ప్రదర్శించారు. సినిమా చూసేందుకు థియేటర్‌లోపలికి వచ్చిన ఆడియెన్స్  `ధమాకా` టైటిల్స్ చూసి ఆశ్చర్యపోయారు. దానికి బదులు ఇది ప్రదర్శిస్తున్నారని అర్థం కావడంతో థియేటర్ లోనే గోల పెట్టారు. దీంతో తప్పుని గమనించిన థియేటర్‌ సిబ్బంది వెంటనే తప్పు దిద్దుకుని `ధమ్కీ`ని ప్రదర్శించారు. 

ఈ వీడియోని తీసిన ఆడియెన్స్ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. రెండు సినిమాల టైటిల్స్ దగ్గరగా ఉండటంతో సిబ్బంది కన్‌ ఫ్యూజ్‌ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కామెడీ ఎమోజీలు పెడుతున్నారు. మరోవైపు రాత్రి తాగింది దిగలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.  రవితేజ హీరోగా నటించిన `ధమాకా` చిత్రం గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్‌ అయి రవితేజకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది.

ఇక విశ్వక్‌ సేన్‌ చివరగా `ఓరిదేవుడా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తనే దర్శకత్వం వహిస్తూ, ద్విపాత్రాభినయం చేస్తూ `ధమ్కీ` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాని కూడా తనే నిర్మించడం విశేషం. ఉగాది సందర్భంగా విడుదలైన సినిమా రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీలా నిలిచింది. థియేటర్లలో మిశ్రమ స్పందన రాబట్టుకుంటుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్