అల్లరి నరేష్ ని కన్ఫూజ్ చేస్తున్న 'మహర్షి' ?

Published : May 07, 2019, 07:45 PM IST
అల్లరి నరేష్ ని కన్ఫూజ్ చేస్తున్న 'మహర్షి' ?

సారాంశం

ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి లో అల్లరి నరేష్ పాత్ర కీలకం కానున్న సంగతి తెలిసిందే.  అమెరికా నుంచి వచ్చన  మల్టి మిలియనీర్ మహేష్ ..ఓ సాధారణ రైతుగా టర్న్ తీసుకోవటానికి నరేష్ పాత్రే కేటలిస్ట్ గా పనిచేస్తుంది.

ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి లో అల్లరి నరేష్ పాత్ర కీలకం కానున్న సంగతి తెలిసిందే.  అమెరికా నుంచి వచ్చన  మల్టి మిలియనీర్ మహేష్ ..ఓ సాధారణ రైతుగా టర్న్ తీసుకోవటానికి నరేష్ పాత్రే కేటలిస్ట్ గా పనిచేస్తుంది. దాంతో సినిమాని మలుపు తిప్పే ఆ పాత్ర తన కెరీర్ ని కూడా మలుపు తిప్పుతుందని నరేష్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకమందే అతనికి వరసపెట్టి క్యారక్టర్ ఆర్టిస్ట్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.  

దాంతో ఇప్పుడే పరిస్దితి ఇలా ఉంటే మహర్షి రిలీజ్ అయ్యాక తనకు కంటిన్యూగా అవే ఆఫర్స్ వస్తాయోమో అని నరేష్ కంగారుపడుతున్నారట. కమిడియన్ గా నరేష్ ఈ మధ్యన వెనకబడ్డారు. దాంతో రూట్ మార్చారు. ఈ సినిమా ప్రభావంతో తనకు మళ్లీ పాత వైభవం వచ్చి కామెడీ సినిమాల్లో బిజీ అవుతానేమో అని ఆశపడ్డాడట. ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకు ఆఫర్స్ వస్తే ఏం చేయాలి..నో చెప్పాలా..కాదనాలా అనే డైలమోలో ఉన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

మరో ప్రక్క నరేష్ గత కొద్ది రోజులుగా కథలు వింటున్నారని, త్వరలోనే నరేష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కావచ్చు అని టాక్.  ఓ కొత్త డైరక్టర్ కు, తనతో గతంలో సినిమాలు చేసి హిట్ ఇచ్చిన డైరక్టర్ తోనూ సినిమాలు చేసేందుకు నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే వీటిలో ఏది ముందు మొదలవుతుందనేది తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?