అడవిలో అల్లు అర్జున్!

Published : May 07, 2019, 06:54 PM ISTUpdated : May 07, 2019, 06:59 PM IST
అడవిలో అల్లు అర్జున్!

సారాంశం

సుకుమార్ - స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ లొకేషన్స్ వెతికే పనిలో పడ్డాడు. దాదాపు స్క్రిప్ట్ పనులను మొత్తం ఇటీవల ముగించుకున్న సుక్కు వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. 

ఇక సినిమా కథ తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లో మొదలవుతుందని గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ అడవుల్లో కనిపించే విధానం మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని ఇన్ సైడ్ టాక్. సినిమాకు సంబందించిన చాలా సీన్స్ అడవుల్లో చిత్రీకరిస్తారట. అందుకోసం తిరుపతిలోని కొన్ని ప్రాంతాలను దర్శకుడు పరిశీలిస్తున్నాడు. 

యాక్షన్ సీన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండాలని సుక్కు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?