శివుడు పాత్రలో నాగార్జున...నప్పుతాడా?

Published : May 07, 2019, 07:38 PM ISTUpdated : May 07, 2019, 07:42 PM IST
శివుడు పాత్రలో నాగార్జున...నప్పుతాడా?

సారాంశం

  నాగార్జున వయస్సుతో సంభందం లేకుండా వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మన్మధుడు 2 చిత్రం చేస్తున్న ఆయన శివుడు పాత్రలో త్వరలో కనిపించనున్నారని సమాచారం.

నాగార్జున వయస్సుతో సంభందం లేకుండా వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మన్మధుడు 2 చిత్రం చేస్తున్న ఆయన శివుడు పాత్రలో త్వరలో కనిపించనున్నారని సమాచారం. తమిళ,తెలుగు భాషలో రూపొందే ఆ చిత్రం కోసం  ఆ మధ్యన నాగ్ తో  శివుడు గెటప్ వేసి ఫొటో షూట్ చేసినట్లు చెప్తున్నారు. తన పాత్ర వైవిధ్యంగా ఉండటంతో నాగ్ ఆ పాత్రను రిస్క్ అనిపించినా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓ మల్టిస్టారర్. ఈ సినిమాకు తమిళ హీరో ధనుష్ డైరక్షన్ చేయబోతున్నారు. 

 బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు ఎస్‌జే.సూర్య, నటి అదితిరావు తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి నాన్‌ రుద్రన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్ర కథలో 15వ శతాబ్ధానికి సంబంధించిన సన్నివేశాలుంటాయని, ఆ ఎపిసోడ్‌లోనే నాగార్జున కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 

అయితే శివుడు ప్రధాన పాత్రలో చేసిన సినిమాలు ఆడిన ధాకలాలు ఏమీ లేవు.  ఎన్టీఆర్ దక్షయజ్ఞం, చిరంజీవి శివుడుగా చేసిన శ్రీ మంజునాథ, ప్రకాష్ రాజ్ శివుడుగా చేసిన ఢమురకం చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దాంతో ఈ సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ కాకుండా హిట్ కొట్టాలని ధనుష్ భావించి చేస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటంగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ సినిమా కోసం ధనుష్ చాలా నియమ నిష్టలతో గడుపుతున్నట్లు తమిళ మీడియా అంటోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా