ఇర్ఫాన్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్!

Published : Apr 03, 2019, 04:37 PM IST
ఇర్ఫాన్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్!

సారాంశం

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంతకాలంగా ఎండోక్రైన్‌ ట్యూమర్ తో బాధపడుతున్నారు. చికిత్స కోసం లండన్ వెళ్లిన ఇర్ఫాన్ మంగళవారం నాడు ముంబై చేరుకున్నారు.

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంతకాలంగా ఎండోక్రైన్‌ ట్యూమర్ తో బాధపడుతున్నారు. చికిత్స కోసం లండన్ వెళ్లిన ఇర్ఫాన్ మంగళవారం నాడు ముంబై చేరుకున్నారు. దాదాపు ఏడాది పాటు లండన్ లో ఉన్న ఆయన సగం ట్రీట్మెంట్ పూర్తి కావడంతో మంగళవారం భారత్ కి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''బహుశా గెలవాలనే ఉత్సుకతతో మనల్ని ఎవరు ఎంత ప్రేమిస్తున్నారో(అభిమానులను ఉద్దేశిస్తూ) మర్చిపోతున్నాం.

బలహీనపడిపోయినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. తనను ప్రేమిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ.. త్వరలోనే మీ ముందుకు రావాలనుకుంటున్నానని చెప్పారు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఇర్ఫాన్ తొందరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఇర్ఫాన్ 'హిందీ మీడియం 2' అనే సినిమాలో నటిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..