లక్ష్మీస్ ఎన్టీఆర్: బాబుగారి రేంజ్ పెరిగింది

Published : Apr 03, 2019, 04:36 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్: బాబుగారి రేంజ్ పెరిగింది

సారాంశం

13 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ విజయవాడ తేజం మూడేళ్ళలోనే పొలిటికల్ బయోపిక్ లతో బాగా క్లిక్కయ్యాడు.

సాధారణంగా నిజ జీవితంలోని పాత్రలను తెరపై చూపించాలంటే దర్శకులకు చాలా కష్టమైనా పని. వివాదాలను పక్కనపెడితే అసలు ఆ పాత్ర ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే గాని తెలియదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని వెండితెరపై చూపించడంలో దిట్ట అని మరోసారి నిరూపించాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుగా కనిపించిన యువ నటుడు శ్రీ తేజ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.13 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ విజయవాడ తేజం మూడేళ్ళలోనే పొలిటికల్ బయోపిక్ లతో బాగా క్లిక్కయ్యాడు. 

వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రుగా కనిపించి అందరిని ఆశ్చర్యపరచిన  శ్రీ తేజ్ ఎన్టీఆర్  బయోపిక్ లో వైఎస్.రాజశేఖర్ రెడ్డిగా కనిపించిన సంగతి తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర కోసం వర్మ ఎక్కువగా ఆలోచించలేదట. చంద్రబాబు గెటప్ లో శ్రీ తేజ్ ని రెడీ చేసి ఫోటో షూట్ అనంతరం రెండు నిమిషాల్లోనే ఫిక్స్ చేశాడట. 

లక్మిస్ ఎన్టీఆర్ సినిమాలో బాబు గారి పాత్ర క్లిక్కవ్వడంతో టాలీవుడ్ అంతా శ్రీ తేజ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విజయవాడ కుర్రాడు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు