లీకైపోయిన ట్విస్ట్.. చైతు ఫ్యాన్స్ కి కన్నీళ్లు తప్పవు, అందుకే అమీర్ ఖాన్..

pratap reddy   | Asianet News
Published : Aug 14, 2021, 01:32 PM IST
లీకైపోయిన ట్విస్ట్.. చైతు ఫ్యాన్స్ కి కన్నీళ్లు తప్పవు, అందుకే అమీర్ ఖాన్..

సారాంశం

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంపై టాలీవుడ్ లో కూడా ఆసక్తి ఎక్కువైపోతోంది. అందుకు కారణం ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తుండడమే.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంపై టాలీవుడ్ లో కూడా ఆసక్తి ఎక్కువైపోతోంది. అందుకు కారణం ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తుండడమే. నాగ చైతన్యకు బాలీవుడ్ లో ఇది డెబ్యూ మూవీ. అద్భుతమైన కథ, తన పాత్రలో ఎమోషనల్ అంశాలు, పైగా అమీర్ ఖాన్ చిత్రం కావడంతో ఫ్రెండ్ రోల్ అయినప్పటికీ చైతు ఈ చిత్రానికి ఒకే చెప్పాడు. 

ఇదిలా ఉండగా శుక్రవారం రోజు అమీర్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంకి వచ్చాడు. లాల్ సింగ్ చద్దా చిత్రంలో కొన్ని సన్నివేశాలని అమలాపురంలో చిత్రీకరించనున్నారు. అయితే ఈ చిత్రంలో అసలు ట్విస్ట్ లీకైపోయింది. ఏపీలో ఈ చిత్రాన్ని షూట్ చేయడానికి బలమైన కారణం కథలోనే ఉంది. 

అమీర్ ఖాన్, చైతు ఇద్దరూ ఆర్మీ అధికారులుగా, స్నేహితులుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య ఆర్మీ అధికారిగా వీరమరణం పొందుతాడట. చైతు అమలాపురంకి చెందిన యువకుడిగా ఆర్మీలో చేరుతాడు. అతడు మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అమీర్ ఖాన్ అమలాపురంకి వస్తాడట. 

చైతు, అమీర్ ఖాన్ మధ్య ఫ్రెండ్ షిప్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. చైతు, అమీర్ ఖాన్ ప్రత్యర్థులతో పోరాటం చేయడం.. ఆ తర్వాత చైతు మరణించడం లాంటి సన్నివేశాలని దర్శకుడు అద్వైత్ చందన్ బలంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?