‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రిలీజ్ డేట్ ఇచ్చేసారు

By Surya PrakashFirst Published Aug 14, 2021, 8:58 AM IST
Highlights

 ‘‘రెండో దశ కరోనా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. మా చిత్రమూ అందరికీ వినోదం పంచుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’’ని దర్శక,నిర్మాతలు చెప్తున్నరు.
 

క్రితం వారం థియోటర్ లో రిలీజైన ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం కలెక్షన్స్ వైజ్ బాగుండటంతో మిగతా సినిమాలు కూడా ధైర్యం చేస్తున్నాయి. చాలా సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు క్యూ కడుతున్నాయి.అనేక సార్లు రిలీజ్ డేట్ లను ప్రకటిస్తూ వచ్చిన ఈ చిత్రాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి ఆగస్టు 27న థియోటర్లలో వాలేందుకు ముస్తాబయ్యాయి. అలా ఆగస్టు చివరి వారంలో సందడి చేయనున్న చిత్రాలలో ఒకటి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.

సుశాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించారు. రవి శంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘‘రెండో దశ కరోనా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. మా చిత్రమూ అందరికీ వినోదం పంచుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’’ని దర్శక,నిర్మాతలు చెప్తున్నరు.

 కొద్ది రోజులు క్రితం ఈ టీజర్‌ను రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.   ఈ సినిమా  బైక్‌ పార్కింగ్‌ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్‌ను ఎక్కించుకోవడం.. అనంతరం నో పార్కింగ్‌ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది.

లవ్‌, ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించారు. హీరోయిన్‌గా ‘మిస్‌ గ్రాండ్ ఇండియా’ మీనాక్షి చౌదరి తెరంగ్రేటం చేయనుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్‌ కీలక పాత్రల్లో నటించారు. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని అందించారు.

click me!