
మెగాస్టార్ చిరంజీవి తన 153వ చిత్రాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలైంది. మలయాళ సూపర్ హిట్ `లూసీఫర్`కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభమైంది. యాక్షన్ సీక్వెన్స్ తోనే చిరంజీవి ఈ కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ రూపొందించిన సెట్‌లో జరుగుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్‌ను శిల్వ స్టంట్ సమకూర్చుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి `గాడ్‌ఫాదర్`, `కింగ్‌మేకర్` అనే టైటిల్స్‌ను చిత్రయూనిట్ పరిశీలిస్తున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా ఛాయాగ్రాహకులు. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాకాడ అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మరోవైపు ప్రస్తుతం చిరు `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన పూజా హెగ్డే కనిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల(ఆగస్ట్) 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులు మంచి ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నాట. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఫస్ట్ లుక్ ఉంటుందని టాక్. మరోవైపు `ఆచార్య` విడుదల తేదీపై సస్పెన్స్ నెలకొంది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. సినిమాని జనవరి మొదటి వారంలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది బర్త్ డే రోజు క్లారిటీ వస్తుంది.