’కార్తికేయ -2’ కి ఇంట్రస్టింగ్ టైటిల్ ఫైనల్

Surya Prakash   | Asianet News
Published : Jul 13, 2021, 01:57 PM IST
’కార్తికేయ -2’ కి ఇంట్రస్టింగ్ టైటిల్ ఫైనల్

సారాంశం

 చందు-నిఖిల్‌ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈసినిమా తెరకెక్కుతోంది. ‘5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం. ఆ యుగ అనంత జ్ఞాన సంపద. అందులో దాగి ఉన్న ఒక రహస్యం. ఈ యుగంలో అన్వేషణ. స్వార్థానికి ఒకరు. సాధించడానికి ఒకరు. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు’ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న  ఈచిత్రానికి టైటిల్ పైనల్ అయ్యింది.  


చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా కార్తికేయ -2 అన్నారు. రీసెంట్ గా ఈ సినిమా  టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

దైవం మనుష్య రూపేణా అనే టైటిల్ ని ఈ సీక్వెల్ సినిమాకు దర్శక,నిర్మాతలు ఫైనల్ చేసినట్లు సమాచారం.త్వరలో అఫీషియల్ ప్రకటన రానుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని చెప్పబోతున్నట్లు  తెలుస్తుంది. ‘5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం. ఆ యుగ అనంత జ్ఞాన సంపద. అందులో దాగి ఉన్న ఒక రహస్యం. ఈ యుగంలో అన్వేషణ. స్వార్థానికి ఒకరు. సాధించడానికి ఒకరు. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు’ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. 

 డైరక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ...పక్కా సీక్వెల్ చిత్రమిది. హీరో, అతని కుటుంబం, స్నేహితులు తొలి సినిమాలో ఉన్నట్లే ఉంటారు. కాకపోతే ఇందులో హీరోకి ఓ కొత్త సమస్య, కొత్త ఛాలెంజ్ ఎదురవుతుంది. తొలి సినిమాలో గుడి సమస్య అయితే, ఇందులో అంతకంటే పెద్ద సమస్య. అంతకంటే పెద్ద సాహసం చేయాల్సి వస్తుంది. అదెలా చేశాడు? ఈసారి ఎదురైన సమస్య ఏమిటనేదే ఈ సినిమా.
 
 ప్రస్తుతం నిఖిల్.. సుకుమార్ రైటింగ్స్ లో ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut: ప్రభాస్ హీరోయిన్ బంగ్లా ఇన్సైడ్ ఫోటోలు ..కాంట్రవర్సీల క్వీన్ ఇల్లు చూశారా
Sreeleela Career: అందం, టాలెంట్ ఉన్నా ఈ హీరోయిన్‌కు అవకాశాల్లేవా? కారణం తెలిస్తే షాకవుతారు!