థ్రిల్‌ డబుల్‌.. `రాక్షసుడు`కి సీక్వెల్‌ః అఫీషియల్‌

Published : Jul 13, 2021, 12:25 PM IST
థ్రిల్‌ డబుల్‌.. `రాక్షసుడు`కి సీక్వెల్‌ః అఫీషియల్‌

సారాంశం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ `రాక్షసుడు` చిత్రానికి త్వరలో సీక్వెల్‌ రాబోతుంది. దీన్ని అధికారికంగా ప్రకటించారు.

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `రాచ్చసన్‌` చిత్రాన్ని తెలుగులో `రాక్షసన్‌` పేరుతో రీమేక్‌ చేశారు దర్శకుడు రమేష్‌ వర్మ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాల్లో ఉన్న బెల్లంకొండకి మంచి హిట్‌ని అందించి ఊపిరి పీల్చుకునేలా చేసింది. నటుడిగానూ ఈ సినిమాతో మెచ్యూర్డ్ నటనని ప్రదర్శించాడు బెల్లంకొండ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ తీసుకురాబోతున్నాడు రమేష్‌ వర్మ. 

ప్రస్తుతం `ఖిలాడీ` సినిమాని రూపొందించిన ఆయన `రాక్షసుడు 2`ని తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ స్టార్‌ హీరోతో ఈ సినిమా తీయబోతున్నారట. మరో అదిరిపోయే డబుల్‌ థ్రిల్లర్‌ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తామని, పెద్ద హీరో నటిస్తారని వెల్లడించారు. అయితే బెల్లంకొండ స్థానంలో మరో హీరోని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి హీరోయిన్‌ మారుతుందా? ఆమె ఉంటుందా? అన్నది చూడాలి. ఏ స్టూడియోస్‌ ఫిల్మ్స్ పతాకంపై, హవీష్‌ ప్రొడక్షన్‌లో కోణేరు సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందట.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌