bigg boss 15: ఎవరీ కాశ్మీర్ యువకుడు ఉమర్ రియాజ్.. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ, ప్రేయసి ఎవరంటే

pratap reddy   | Asianet News
Published : Oct 01, 2021, 04:50 PM ISTUpdated : Oct 01, 2021, 06:42 PM IST
bigg boss 15: ఎవరీ కాశ్మీర్ యువకుడు ఉమర్ రియాజ్.. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ, ప్రేయసి ఎవరంటే

సారాంశం

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా దిగ్విజయంగా 14 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి బిగ్ బాస్ 15 ప్రారంభం కానుంది.

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా దిగ్విజయంగా 14 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి బిగ్ బాస్ 15 ప్రారంభం కానుంది. రియా చక్రవర్తి, షమితా శెట్టి ఇలా స్టార్ సెలెబ్రిటీల పేర్లు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక కాశ్మీర్ కి చెందిన ఓ యువకుడు బిగ్ బాస్ 15లో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. అతడి పేరు ఉమర్ రియాజ్. బిగ్ బాస్ 13లో రన్నరప్ గా నిలిచిన ఆషిమ్ రియాజ్ సోదరుడే ఉమర్ రియాజ్. ఉమర్ రియాజ్ కాశ్మీర్ లో 1990 జనవరి 1న జన్మించాడు. 

ఉమర్ రియాజ్ విద్యాభ్యాసం మొత్తం జమ్మూలో ముగిసింది. చిన్నప్పటి నుంచి ఉమర్ డాక్టర్ కావాలని కలలు కనేవాడు. అందుకు తగ్గట్లుగానే మెడిసిన్ చదివి జమ్మూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి 2013లో డాక్టర్ పట్టా పొందాడు. అప్పటి నుంచి ఉమర్ రియాజ్ ముంబైలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 

అలాగే సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగంపై మక్కువతో మ్యూజిక్ వీడియోలు చేయడం ప్రారంభించాడు. దర్శకుడిగా మారాలనే కోరిక కూడా రియాజ్ కు ఉంది. ఇదిలా ఉండగా ఉమర్ రియాజ్ ఇంకా బ్యాచిలర్. ప్రస్తుతం అతడు బుల్లితెర నటి సోనాల్ సోనాల్ వెంగులేకర్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

మరి బిగ్ బాస్ 15లోకి అడుగుపెట్టబోతున్న ఉమర్ రియాజ్ ఈమేరకు సత్తా చాటుతాడో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే