మోడీ బయోపిక్ లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్?

By team teluguFirst Published Aug 27, 2021, 3:36 PM IST
Highlights

కొన్నాళ్లుగా నరేంద్ర మోడీ గడ్డం పెంచుతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రారంభం నుండి విజయేంద్ర ప్రసాద్ సైతం గడ్డం తీయలేదు. ఋషులకు మాదిరి విజయేంద్ర ప్రసాద్ గడ్డం చాలా పొడవుగా పెరిగింది.

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి ఓ క్రేజీ ఆఫర్ దక్కిందట. మోడీ బయోపిక్ గా తెరకెక్కనున్న ఓ చిత్రంలో మోడీ రోల్ చేయాలంటూ ఓ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ని కోరారట. పొడవైన గడ్డం పెంచిన విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ లుక్ అచ్చు మోడీని తలపిస్తుండగా, మోడీ పాత్రకు ఆయన బాగా సూట్ అవుతారని సదరు దర్శకుడు భావిస్తున్నారట. 


కొన్నాళ్లుగా నరేంద్ర మోడీ గడ్డం పెంచుతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రారంభం నుండి విజయేంద్ర ప్రసాద్ సైతం గడ్డం తీయలేదు. ఋషులకు మాదిరి విజయేంద్ర ప్రసాద్ గడ్డం చాలా పొడవుగా పెరిగింది. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ లుక్ చూసిన ఓ యువ దర్శకుడు తాను అనుకుంటున్న మోడీ బయోపిక్ కి విజయేంద్ర ప్రసాద్ చక్కగా సరిపోతారని ఫిక్స్ అయ్యాడట. ఆలోచన వచ్చిందే తడవుగా విజయేంద్ర ప్రసాద్ ని ఆ డైరెక్టర్, ఆ పాత్ర చేయాలని కోరారట. 


రైటర్ గా ఫుల్ బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ చిన్న నవ్వు నవ్వి.. ఇప్పుడు కుదరదని చెప్పినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు మూవీ కథపై కసరత్తులు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి మహేష్ తో మూవీ చేయనున్నట్లు ప్రకటించగా.. ఆ ప్రాజెక్ట్ కథను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఆయన. అన్నీ కుదిరి మోడీ బయోపిక్ లో విజయేంద్ర ప్రసాద్ నటిస్తే అది ఒక సెన్సేషన్ అవుతుంది. 
 

click me!