సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్', విజయ్ సేతుపతి కీలక పాత్రలో

Published : Aug 27, 2021, 01:06 PM IST
సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్', విజయ్ సేతుపతి కీలక పాత్రలో

సారాంశం

సందీప్ కిషన్ కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతున్న ఇందులో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

యంగ్ హీరో సందీప్ కిషన్ ఏకంగా పాన్ ఇండియా మూవీ ప్రకటించేశారు.మైఖేల్  అనే టైటిల్ తో తెరకెక్కనున్న భారీ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. నిర్మాత సునీల్ నారంగం బర్త్ డే పురస్కరించుకొని నేడు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకటన పోస్టర్ లో రక్తసిక్తమైన రెండు చేతులలో ఓ చేతికి సంకెళ్లు, ఓ చేతికి మారణాయుధం కలిగి ఉంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ మైఖేల్ తెరకెక్కే అవకాశం కలదు. 


రంజిత్ జేయకొడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. సందీప్ కిషన్ కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతున్న ఇందులో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాను భరత్ చౌదరి మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. 


పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న మైఖేల్ ప్రకటనతోనే హైప్ తెచ్చుకుంది. తెలుగు, హిందీ, తమిళం కన్నడ, మలయాళ భాషలలో రూపొందనుంది. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌