గోపీచంద్ 'సీటీమార్' వెనుక దాగున్న కష్టం.. దర్శకుడు 700 మంది అమ్మాయిలతో..

By telugu teamFirst Published Aug 27, 2021, 2:03 PM IST
Highlights

మాస్ హీరో గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం సీటీమార్.

మాస్ హీరో గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

గోపీచంద్ కు జోడిగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది కబడ్డీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కమర్షియల్ అంశాలు కలగలిపి తెరకెక్కించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్స్ లోనే గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో సంపత్ నంది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రెండు టీమ్స్ కబడ్డీ ప్లేయర్స్ ని ఎంపిక చేసేందుకు సంపత్ నంది 700 మంది అమ్మాయిలతో ఆడిషన్స్ నిర్వహించారట. ఇక నలుగురు నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ ని కూడా ఎంపిక చేసుకున్నారు. 

మిగిలిన వాళ్ళని ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేశారు. నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ కి మూడు నెలలు నటనలో శిక్షణ ఇచ్చారట. అదే విధంగా ఆడిషన్స్ లో ఎంపిక చేసుకున్నవారికి కబడ్డీలో మెళుకువలు నేర్పించారట. 

ప్రస్తుతం థియేటర్ రిలీజ్ కు పరిస్థితులు సహకరించడం లేదు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే ప్రదర్శించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రానికి నిర్మాత. 

click me!