బాహుబలి కంటే మూడు రెట్లు.. నిజమా, ప్రభాస్ 'ఆదిపురుష్' పై అదిరిపోయే అప్డేట్

pratap reddy   | Asianet News
Published : Oct 26, 2021, 03:48 PM IST
బాహుబలి కంటే మూడు రెట్లు.. నిజమా, ప్రభాస్ 'ఆదిపురుష్' పై అదిరిపోయే అప్డేట్

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మానియా దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాదే శ్యామ్ టీజర్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మానియా దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాదే శ్యామ్ టీజర్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం అటు ఆదిపురుష్, ఇటు సలార్ చిత్రాల షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నాడు. రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. 

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న Adipurush వచ్చే ఏడాది ఆగష్టు 11న రిలీజ్ కు అవుతోంది. తాజా సమాచారం మేరకు వచ్చే నెలాఖరులోపు ప్రభాస్ పాత్ర షూటింగ్ పూర్తవుతుందట. ఇప్పటికే రావణుడిగా నటిస్తున్న Saif Ali Khan, సీతాదేవిగా నటిస్తున్న kriti Sanon పాత్రల షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ రోల్ పూర్తి కాగానే దర్శకుడు విఎఫ్ఎక్స్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. 

ఈ చిత్రంలో Bahubali కంటే మూడు రెట్లు ఎక్కువగా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 6 నెలలకు పైగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ కోసం సమయం కేటాయించబోతున్నారట. త్రీడీలో కూడా ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర అవుట్ పుట్ అద్భుతంగ వస్తోందని అంటున్నారు. 

Also Read: నా కుమార్తె పెళ్ళికి డబ్బు మాత్రమే ఇస్తా.. నాకు సంబంధం లేదు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

శ్రీరాముడి గెటప్ లో Prabhas లుక్ అబ్బురపరిచే విధంగా ఉండబోతోందట. రామాయణం పౌరాణిక గాధ నేపథ్యంలో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల దృష్టి మొత్తం సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ చిత్రంపైనే ఉంది. 

ఈ చిత్రంలో ప్రభాస్ హస్తరేఖలని బట్టి ఫ్యూచర్ ని పసిగట్టే నిపుణుడిగా నటిస్తున్నాడు. నాకు అన్ని తెలుసు.. కానీ చెప్పను అంటూ టీజర్ లో ప్రభాస్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కి సర్జరీ, 2 నెలల్లో మరో ఆపరేషన్‌, అభిమానులే కారణం.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
Jana Nayagan Censor: 'జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర, ఏకంగా 12 సీన్లు కట్.. నిడివి ఎంతంటే?