ఓటీటీల దూకుడికి కేంద్రం బ్రేకులు.. స్వేచ్ఛకి సంకెళ్లా?

Published : Feb 26, 2021, 08:07 AM IST
ఓటీటీల దూకుడికి కేంద్రం బ్రేకులు.. స్వేచ్ఛకి సంకెళ్లా?

సారాంశం

డిజిటల్‌ మాధ్యమాలు, సోషల్‌ మీడియా దూకుడికి భారత ప్రభుత్వం బ్రేకులు వేస్తుంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ డిజిటల్‌ మీడియాపై నిఘా పెట్టబోతుంది. ఇన్నాళ్లు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యానికి నిజమైన వేదికగా భావించే సామాజిక మాధ్యమాల వేగానికి అడ్డుకట్టలు వేయబోతుంది. 

డిజిటల్‌ మాధ్యమాలు, సోషల్‌ మీడియా దూకుడికి భారత ప్రభుత్వం బ్రేకులు వేస్తుంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ డిజిటల్‌ మీడియాపై నిఘా పెట్టబోతుంది. ఇన్నాళ్లు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యానికి నిజమైన వేదికగా భావించే సామాజిక మాధ్యమాల వేగానికి అడ్డుకట్టలు వేయబోతుంది. అదే సమయంలో విచ్చలవిడి తనానికి బ్రేకులు వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా డిజిటల్‌ మీడియాకి నిబంధనలు తీసుకొస్తుంది. ఈ విషయాలను గురువారం కేంద్ర మంత్రులు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌ సైతం ఇప్పుడు నిఘాలోకి రాబోతుంది.

దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, `కొన్ని ప్రత్యేక సామాజిక మాధ్యమాలను ఉద్దేశించి  కొన్ని ప్రత్యేక సామాజిక మాధ్యమాలను ఉద్దేశించి ప్రస్తుతం రూపొందించిన నిబంధనలు మూడు నెలల్లో అమలులోకి వస్తాయి. ఆలోపు ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ విధాన నిర్ణయాల్ని మెరుగు పర్చుకోవాలి. మిగిలిన నిబంధనలు నిర్ణయాత్మక తేదీ నుంచి అమలులోకి వస్తాయి. భారతదేశంలోకి ప్రతి సామాజిక మాధ్యమానికి మేము స్వాగతం పలుకుతాం. కానీ వారు ఇక్కడి వచ్చి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాలో క్యాపిటల్‌పై దాడి జరిగినప్పుడు విధ్వంసకులపై చాలా కఠినంగా వ్యవహరించారు. కానీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడి విషయంలో ఉదాసీనత చూపించారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణిని మేం ఎంత మాత్రం సహించబోమ`న్నారు. 

మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ మాట్లాడుతూ, `ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఓటీటీ, డిజిటల్ న్యూస్‌ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని మేము చెప్పడం లేదు, కేవలం వాటి నుంచి సమాచారం మాత్రమే కోరుతున్నాం. ఓటీటీ మాద్యమాలు, డిజిటల్ పోర్టల్‌లలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉండాలి. ఓటీటీ మాద్యమాల్లో సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి లేదా ఈ విభాగంలో ప్రముఖ వ్యక్తి నేతృత్వంలోని స్వీయ నియంత్రణ సంస్థ ఉండాలి. అంతే కాకుండా కంటెంట్‌కు సంబంధించి 13+, 16+, ఏ కేటగిరీలతో స్వీయ వర్గీకరణలు ఉండాలి. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లాకింగ్ ఉండాలి. వారికి తెలియకుండా పిల్లలు ఆ లాక్‌ను తెరిచే వీలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి` అని అన్నారు.

ఇలా సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. సమాచార నియంత్రణ విషయమై ట్విట్టర్‌తో కేంద్రానికి నెలకొన్న వివాదమే ఈ నిబంధనలకు కారణమని తెలుస్తుంది. సమాచార నియంత్రణకు 2018 నుంచే ప్రభుత్వం నిబంధనల రూపకల్పనల చేస్తోంది. తాజాగా రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ట్విట్టర్ పట్టించుకోకపోవడం తాజా దూకుడుకు ఆజ్యం పోసింది. సోషల్ మీడియాతో పాటు ఓటీటీ రంగంపై కూడా నూతన  నిబంధనలను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఓటీటీ నిబంధనలు చూస్తే, ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందే. ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి. లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి. జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని తప్పనిసరిగా నియమించాలి. ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కొత్త నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ నిబంధనల్లో చిన్న చిన్న మార్పులతో పాటు మరిన్ని నిబంధనలు చేర్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే దీనిపై సినీ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకులు ఓటీటీలపై నిబంధనలు స్వేచ్ఛకు సంకెళ్లే అని అంటున్నారు. ఎవరికి ఏం కావాలో చూసుకునే స్వేచ్ఛ ఉండాలని, ఇప్పటి వరకు నిజమైన స్వేచ్ఛగా భావించే సోషల్‌ మీడియాపైనే నిబంధనలు పెడితే ఇక స్వేచ్ఛే ఉండదని అంటున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?