తనపై యాక్సిడెంట్‌ కాదు.. హత్యాయత్నంః నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు

Published : Feb 26, 2021, 07:41 AM IST
తనపై యాక్సిడెంట్‌ కాదు.. హత్యాయత్నంః నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారు యాక్సిడెంట్‌ ఘటనపై ఆమె విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. తనది యాక్సిడెంట్‌ కాదని, కొందరు దుండగులు కావాలనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారు యాక్సిడెంట్‌ ఘటనపై ఆమె విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. తనది యాక్సిడెంట్‌ కాదని, కొందరు దుండగులు కావాలనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులో తనకు సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. శ్యామ్‌ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లపాటు సహజీవనం చేశాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆమె గతంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయంతెలిసిందే. 

అయితే ఈకేసుని ఉపసంహరించుకోవాలని ఆయన బెదిరింపులకు దిగుతున్నాడని, తనకు అతని నుంచి ప్రాణ హాని ఉందని ఆమె ఆ మధ్య మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కేసుకి, విజయవాడ ఘటనకి సంబంధం ఉందని ఆమె విజయవాడలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. తనని హత్య చేసే క్రమంలోనే యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడని, తనకు శ్యామ్‌ కె నాయుడిపై అనుమానం ఉందని తెలిపింది. 

శ్యామ్‌ కె నాయుడుపై హైదరాబాద్‌లో పెట్టిన కేసు దర్యాప్తు కోసం ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు, తనతో రాజీ కుదుర్చుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించింది. అంతేకాదు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది శ్రీసుధ. ఇప్పుడు ఆమె యాక్సిడెంట్‌కి గురి కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం