తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, అలసట లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా ఉప్పెన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయన నెక్ట్స్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పటికే తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసారు.

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాను ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉప్పెన భారీ హిట్ కావడంతో తమ ఆలోచనను మార్చుకున్నారు. ఉప్పెన సినిమా మూడు రోజుల్లో రూ.50కోట్ల వసూళ్లను రాబట్టడటం నిర్మాతలను ఉత్సాహపరుస్తోంది. దాంతో క్రిష్ వైష్ణవ్ మార్కెట్‌పై నమ్మకంతో ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్ర బిజినెస్ ఇటీవలే క్లోజ్ అయింది.
దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చిన లక్ష్మణ్ ఈ చిత్ర హక్కులను దాదాపు 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. అతి త్వరలోనే క్రిష్ ఈ సినిమా థియేటిరికల్ రిలీజ్ గురించి ప్రకటన చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ప్రభావం రెండో సినిమాపై కూడా బాగా చూపిస్తోంది. వైష్ణవ్, క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. మరి వైష్ణవ్ తన రెండో సినిమాతో కూడా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరిస్తారేమో వేచి చూడలి.
కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కథ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారి నవల 'కొండపొలం' ఆధారంగా చేసుకొని చేయనున్నారు. ఈ కథకు కావలసిన రైట్స్‌ను క్రిష్ తన సొంతం చేసుకున్నాడు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశారు. ఈ నవల కథ ఎక్కువగా నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. వారు తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. వారు ఏవిధంగా నివసించేవారు అనే అంశాలపై దృష్టి పెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే పాత్రను చేసింది.