ఇండియన్ క్రికెటర్స్ కు విందు ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, RRR హీరోతో ఇండియా టీమ్ సందడి.

Published : Sep 26, 2022, 01:01 PM IST
ఇండియన్ క్రికెటర్స్ కు విందు ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, RRR హీరోతో  ఇండియా టీమ్ సందడి.

సారాంశం

భారత క్రికెటర్లకు ప్రముఖ సినీ కథానాయకుడు రామ్ చరణ్ తన ఇంట్లో పసందైన విందు ఇచ్చారు.  హైదరాబాద్ కు మ్యాచ్ ఆడటానికి వచ్చిన టీమ్ కు తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు చరణ్. 

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో ఆయను ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక నిన్న  భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం హైదరాబాద్ లోని  ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఇంతటి విజయాన్ని దక్కించుకున్న టీమ్ కు రామ్ చరణ్ ఆతిద్యం ఇచ్చాడు. క్రికెటర్లను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించిన చరణ్.. వారికి కనీ వినీ ఎరుగని రీతిలో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.  

మ్యాచ్ ముగిసిన తరువాత హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఇచ్చారు. క్రికెటర్లను సన్మానించి వారితో ముచ్చటించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ప్రముఖ న్యూస్ ఛానెల్ వార్తను ప్రచురించింది. ఈ పిక్స్ ను మెగా హీరో ఈరోజు సోషల్ మీడియాలో రిలీజ్ చేసే అవకావం ఉన్నట్టుతెలుస్తోంది. 

ఇక ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ఓవర్ ఆల్ ఇండియన్ సెలబ్రెటీగా రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈసినిమా ప్రపంచ వ్యప్తంగా భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు  రామ్ చరణ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. బాలీవుడ్ లో కూడా చరణ్ కు తిరుగుండతన్న  మాట వినిపిస్తుంది. ఇప్పటికే చరణ్ తో పాటు  తారక్ కు కూడా  ఆఫర్లు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌