ఇనయాను ఒక ఆట ఆడేసుకుంటున్న శ్రీహాన్, ఇద్దరి మధ్య నామినేషన్ల వార్.. కొత్త గొడవ స్టార్ట్ చేసిన సుల్తాన

By Mahesh JujjuriFirst Published Sep 26, 2022, 12:03 PM IST
Highlights

ఇనయా-శ్రీహాన్ మధ్య  యుద్థ వాతావరణం ఇంకా ముగిసిట్టు లేదు. ఇద్దరి మధ్య ఇంకా వార్ కొనసాగుతూనే ఉంది. నామినేషన్స్ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరిమధ్య ఏజ్ తో పాటు ఎలుకల డిస్కర్షన్ కూడా వచ్చింది.

రసవత్తవరంగా సాగుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 6. మూడో వారం కాస్త డిఫెంట్ గా నడిచిన బిగ్ బాస్.. నాలుగోవారం కూడా అదే జోరు కొనసాగేలా కనిపిస్తుంది. మఖ్యంగా పిట్ట తో స్టార్ట్ అయిన శ్రీహాన్-ఇనయా గొడవ ముదిరి పాకానపడుతోంది. ఇప్పట్లో వారి మధ్య వేడి చల్లారేలా కనిపించడంలేదు. ఇద్దరి మద్య నాగార్జున సఖ్యత కుదుర్చుదామని చూసినా.. వీకెండ్ నాగ్ దగ్గర అంతా సెట్ అయ్యింది అన్నట్టుగానే ఉంటున్నారు ఇద్దరు. మళ్లీ తరువాత గొడవ స్టార్ట్ అవుతోంది. 

ఇక లాస్ట్ వీకెండ్ లో నేహా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా... ఇక తాజాగా మరోసారి నామినేషన్స్ డే  రానే వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ కు సబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ ప్రమోలో నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంతో తో పాటు.. హౌస్ అంతటికి ఇనయా టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది. ఈ నామినేషన్స్ లో ఇనయాతోనే ఎక్కవ మంది నామినేట్ చేయగా.. ముఖ్యంగా శ్రీహాన్ -ఇనయా మధ్య గట్టిగానే దిస్కర్షన్స్ జరిగాయి. 

 

Heated discussions and intense nominations… list lo evaru untaru?

Watch today's episode of Bigg Boss on , streaming 24/7 on . pic.twitter.com/KnQOKE7l40

— starmaa (@StarMaa)

ముందుగా శ్రీహాన్ ఇనయను నామినేట్ చేయగా.. ఆతరువాత శ్రీహాన్ ను ఇనయ నామినేట్ చేసింది. తన ఏజ్ గురించి ఎందుకు మాట్లాడావు అంటూ మరో కొత్త గోడవ బయటకు తీసింది. నాకంటే నువ్వు చిన్నవాడివి ఎలా అవుతావు.. నా ఏజ్ గురించి నీకు ఎందుకు.. కాస్త పెద్దగా కనిపిస్తే..నువ్వు నాకంటే చిన్నవాడివి అయిపోతావా అంటూ ఇనయా తన పద్దతిలో గట్టిగా గోల చేసింది. శ్రీహాన్ మాత్రం బాగా వెటకారం చూపిస్తూ.. ఇనయాను ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో శ్రీహాన్ ధొరణి కూడా కరెక్ట్ గా లేనట్టు కనిపిస్తోంది. ఏది మాట్లాడినా.. అది నీకు కన్వర్ట్ చేసుకుని.. నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు.. పక్కన వాళ్ళను కూడా ఇబ్బందిపెడుతున్నావు అంటూ శ్రీహాన్ ఇనయాకు క్లాస్ పీకాడు. 

ఇక ఇనయాను చాలా మంది నామినేట్ చేశారు. ఒక దశలో సుదీపాకు.. ఇనయాకు కూడా గట్టిగానే వాదులాట జరిగింది. తాను బిగ్ బాస్ లో ఉన్న 20మంది కోసం బ్రతకడంలేదని.. తను ఎలా ఉండాలో అలానే ఉంటాను కాని.. మీకోసం నాక్యారెక్టర్ చంపుకోనంటూ. ఇనయా తెగేసి చెప్పేసింది.  ఇక   ఈసారి నామినేట్ అయినవాళ్లలో.. ఇనయా, శ్రీహాన్, చంటీ, రేవంత్,అరోహీ,గీతూలు ఉన్నట్టు ప్రోమోలో తెలుస్తోంది. మరికొంత మంది కూడా ఉండే అవకాశం ఉంది. 

click me!