శృంగార కోరికలు ఆపుకోలేక పాయిల్ ఏం చేస్తుందో...

Google News Follow Us

సారాంశం

నింఫోమానియాక్‌ అంటే.. శృంగార కోరికలను అదుపు చేయలేని స్థితి. అలాంటి పాత్రలో ఆమె కనిపించబోతుందని అంటున్నారు.  


ఏదో ఒక విభిన్నత సినిమాలో లేకపోతే జనం చూడటం లేదు. కొత్తదనం కోసం ప్రేక్షకుడి అన్వేషణ నిరంతరం కొనసాగుతోంది. అలా వచ్చిన చిత్రాలనే హిట్ చేస్తున్నారు. దాంతో దర్శక,నిర్మాతలు ఒకటికి పదిసార్లు తమ కాన్సెప్టుని చెక్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు.  ఈ క్రమంలోనే మంగళవారం చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా తెరపై ఇప్పటిదాకా రాని విధంగా  రూపొందింది అని సమాచారం. వివరాల్లోకి వెళితే...

΄పాయల్‌ రాజ్‌పుత్, అజ్మల్‌ అమీర్‌ జంటగా నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, ఎం.సురేష్‌ వర్మతో కలిసి అజయ్‌ భూపతి ‘ఎ’ క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది.  ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో పాపులరైన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు.. అందులో హీరోయిన్‌గా ఒక డేరింగ్‌ రోల్‌ చేసిన పాయల్‌ రాజ్‌ పుత్‌ కూడా సెన్సేషన్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్‌ కు చాలా అవకాశాలు వచ్చాయి. ఏదో పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు మరోసారి దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో నటిస్తోంది పాయల్‌. పాయల్‌ లీడ్‌ రోల్‌ లో దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందించిన చిత్రం ‘మంగళవారం’.
 
ఈ  చిత్రంలో పాయల్‌ చేసిన పాత్ర ఇంట్రస్టింగ్ గా సాగనుందని తెలుస్తోంది. ఇందులో పాయల్‌ నింఫోమానియాక్‌ కండీషన్‌ వున్న పాత్రలో కనిపిస్తుందని సమాచారం. నింఫోమానియాక్‌ అంటే.. శృంగార కోరికలను అదుపు చేయలేని స్థితి. అలాంటి పాత్రలో ఆమె కనిపించబోతుందని అంటున్నారు.  ఈ పాత్ర చాలా బోల్డ్‌ గా వుంటుందని, కథలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని సమాచారం. రిలీజైనన ట్రైలర్‌ లో కొన్ని బోల్డ్‌ సీన్లు వున్న సంగతి తెలిసిందే. ”ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత పాయల్‌` అజయ్‌ భూపతి కాంబోలో తెరకెక్కిన చిత్రం కావడంతో ‘మంగళవారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.  

దర్శకుడు మాట్లాడుతూ.... ‘మహాసముద్రం’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ‘మంగళవారం’ చిత్రం చేయాలని ఫిక్స్‌ అయ్యాను. కమర్షియల్‌ సినిమాలు ఒక మీటర్‌ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ, ‘మంగళవారం’ లాంటి చిత్రం తీయడం చాలా కష్టం. డైరెక్షన్‌ అండ్‌ టెక్నికల్‌ వేల్యూస్, ఆర్టిస్టుల యాక్టింగ్‌ వంటివి చాలా ఉంటాయి. అలాగే నటీనటులతో ΄పాటు సాంకేతిక నిపుణులందర్నీ ఒక్క తాటిపైకి తీసుకు రావడం కష్టంగా అనిపించింది. ∙‘మహాసముద్రం’ సమయంలో అదితీరావు హైదరీకి కూడా ‘మంగళవారం’ కథ చెప్పాను.. ఆమె చేస్తానన్నారు. అయితే ఆ తర్వాత ఆమెను నేను సంప్రదించలేదు.‘మంగళవారం’ ఏ స్థాయి సినిమా అని నేను ముందు ఊహించకోకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను అన్నారు.