
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ( IIFA) ఏటా అందించే అవార్డులను ఈ సంవత్సరానికి గాను మే నెలలో ఇవ్వాల్సి ఉంది. దాన్ని కాస్తా జూలైకి మార్చుతూ గతంలో ప్రకటన చేశారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ ఈవెంట్ ను 2021లో తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ తిరిగి మళ్లీ నిర్వహించేందుకు ఆర్గనైజర్స్ అన్ని ఏర్పాాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించాల్సిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తొలుత మేలో అబుదాబిలో నిర్వహించాలని నిర్ణయించిన కుదరలేదు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Sheikh Khalifa Bin Zayed Al Nahyan) మరణంతో వాయిదా పడింది. యూనైడెట్ అర్బన్ ఎమిరేట్స్ 16వ పాలకుడిగా కొనసాగిన ఆయన 73 ఏండ్ల వయస్సులో మే13న మృతి చెందారు. దీంతో యూఏఈ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
కోవిడ్ మహమ్మారి కారణంగా ఐఫా ఈవెంట్ 2021ను తాత్కాలికంగా నిలిపివేయడంతో.. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి మేనెలలో 19 నుంచి 21 వరకు నిర్వహించేందుకు సిద్ధమైనా అధ్యక్షుడి మరణంతో వాయిదా పడింది. దీంతో జూలై 14 నుంచి 16 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ వాయిదాను ఆర్గనైజర్లు కాస్తా ముందుకు తీసుకొస్తూ తాజాగా కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు. ఈమేరకు ఒక ప్రకటన చేశారు. ‘సినిమా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రపంచాన్ని ఏకం చేస్తూ... IIFA 2022 కొత్త తేదీలను ప్రకటిస్తున్నాం. ఈవెంట్ జూన్ 2 నుండి 4 వరకు కొనసాగనుంది.’ అని తెలిపారు.
22వ ఎడిషన్ గా కొనసాగనున్న IIFA 2022 ఈవెంట్ ను బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ (Salman Khan),రితీష్ దేశ్‌ముఖ్ మరియు మనీష్ పాల్ హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనకారులలో కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, దివ్య ఖోస్లా కుమార్, నోరా ఫతేహి మరియు అనన్య పాండే ఉన్నారు. ఈవెంట్ లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ‘షెర్షా’ ఉత్తమ కథగా, ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుల నామినేషన్లలో ఒకటిగా ఉంది. రణవీర్ సింగ్-నటించిన ‘83’, అనురాగ్ బసు ‘లుడో’, ‘తాన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్’, ‘తప్పడ్’ చిత్రాలు నామినేషన్ లో ఉన్నాయి.