
సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్’. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చంద్రప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, మ్యూజిక్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, సోనూసూద్ (Sonu Sood) ఈ మూవీలో చాలా పాజిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. Prithvirajలో సోనూ సూద్ లుక్ చాలా కొత్తదనంతో ఆకట్టుకుంటోంది. పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవి చాంద్ బర్దాయి పాత్రలో సోన్ సూద్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను చిత్ర యూనిట్ తాజాగా షేర్ చేసింది. ప్రస్తుతం పిక్స్ కు నెటిజన్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తన కేరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందిస్తుందని తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘ఆచార్య’లోనూ సోనూసూద్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ప్రస్తుతం తన హోమ్ ప్రొడక్షన్ లో వస్తున్న 'ఫతే'లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూ సూద్, అశుతోష్ రానా, మానవ్ విజ్, సాక్షి తణ్వార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ - ఎహసాన్ - లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3 న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేకర్స్. ఈ మూవీ తెలుగు తమిళ హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.