
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో క్లారిటీ రాబోతున్నాయి. ఎవరు గెలిచేది తేలనుంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో అన్నింటికంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ఫలితంపైనే అందరి ఫోకస్ ఉంది. రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఓ వైపు, పిఠాపురం మరో వైపు అనేలా ఈ ఎన్నికల పర్వం సాగింది. పవన్ కళ్యాణ్‌కి పోటీగా వైఎస్‌ఆర్ సీపీ నుంచి వంగా గీతా పోటీలో ఉన్నారు.
ఆమె తరఫున చాలా మంది ప్రచారం చేశారు. సీఎం జగన్‌తోపాటు సినిమా యాంకర్ శ్యామల కూడా ప్రచారం చేసింది. పవన్‌పై అప్పట్లో విరుచుకుపడింది. ఈ అందాల యాంకర్ తనలోని మాస్ యాంగిల్‌ని చూపించింది. ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్‌పై ఆమె ఆసక్తికర, షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన సహాయం చేయడం చూడలేదని వ్యాఖ్యానించింది యాంకర్ శ్యామల. క్యూబ్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
రాజకీయాలంటే ఆవేశం కాదు, రాజకీయాలంటే ఆరవడం కాదు, రాజకీయాలంటే సాయం చేయడం. ఇది నా అవగాహన. కానీ పవన్ కళ్యాణ్‌లో నేను ఇప్పటి వరకు ఆవేశ పడటం చూశా, అరవడం చూశా, ఆయాస పడటం చూశా. ఆయన సహాయం చేయడం తాను చూడలేదని వెల్లడించింది శ్యామల. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీంతోపాటు పిఠాపురంలో వంగా గీతనే గెలుస్తుందని జూన్ 4న ఆ విషయం మీకే తెలుస్తుందని, సర్వేలు మాత్రమే పవన్ గెలుస్తున్నాయని చెప్పాయి, కానీ రిజల్ట్ కాదు కదా అని, వంగా గీత అక్కడ గెలవబోతుందని యాంకర్ శ్యామల వెల్లడించారు. దీనిపై పవన్ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. శ్యామలని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బూతు పదాలతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ సహాయాలు ఏం చేస్తుందని, బావిలో ఉంటే ఏం తెలియదని, బయటకు రావాలని, జూన్ 4 తర్వాత ఆమె పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రకరకాలుగా ఆమెపై విమర్శలు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు ట్రోలర్స్, పవన్ ఫ్యాన్స్. దీంతో ఈ వీడియో క్లిప్ హల్‌చల్ చేస్తుంది. యాంకర్ శ్యామల వైఎస్‌ఆర్‌సీపీకి సపోర్ట్ గా ఉన్న విషయం తెలిసిందే.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ సీపీ సింగిల్‌గా బరిలోకి దిగింది. అయినా ఎవరు గెలుస్తారనేది చాలా టఫ్‌గా మారింది. ఫలితాలు వచ్చేంత వరకు ఎవరూ ఏంటీ అని చెప్పేలా లేదు. కానీ చాలా వరకు సర్వేలు మాత్రం టీడీపీ కూటమి గెలుస్తుందని తెలిపాయి.