విచారణకు హాజరైన నటి హేమ... పోలీసుల అదుపులో స్టార్  క్యారెక్టర్ ఆర్టిస్ట్!

Published : Jun 03, 2024, 05:51 PM IST
విచారణకు హాజరైన నటి హేమ... పోలీసుల అదుపులో స్టార్  క్యారెక్టర్ ఆర్టిస్ట్!

సారాంశం

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమ విచారణకు హాజరైనట్లు సమాచారం. ఆమెను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   

 మే 19న బెంగుళూరు నగర శివారులో గల ఒక ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీ తెల్లవార్లు నిర్వహించారు. నిషేదిత ఉత్ప్రేరకాలు ఉపయోగించారు. వాసు అనే వ్యక్తి బర్త్ డే నేపథ్యంలో ప్రముఖులతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నటి హేమ కూడా ఉన్నారు. నటి హేమ రేవ్ పార్టీకి హాజరయ్యారని బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. 

దీంతో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే బెంగుళూరు రేవ్ పార్టీలో తాను లేనని హేమ వీడియో బైట్ విడుదల చేసింది. నేను హైదరాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ లో చిల్ అవుతున్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. మీరు నమ్మకండి అని హేమ అన్నారు. హేమ అబద్దం చెప్పారని తేలింది. కృష్ణవేణి అనే పేరుతో హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. 

హేమకు రక్త పరీక్షలు చేయగా  పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైంది. ఈ క్రమంలో సీసీబీ పోలీసులు రెండుసార్లు ఆమెకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అనారోగ్య, ఇతర కారణాలు చూపుతూ హేమ  విచారణకు హాజరు కాలేదు. మూడోసారి నోటీసులు జారీ చేయడంతో నేడు హేమ విచారణలో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు విచారించారట. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కలదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. 

మొత్తంగా రేవ్ పార్టీ కేసులో హేమ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న భావన కలుగుతుంది. హేమ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నది. లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించింది. సయ్యద్ జాఫర్ అహ్మద్ అనే వ్యక్తిని హేమ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా