నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.. అందుకే వదిలేశా: స్టార్ హీరోయిన్

Published : Jul 25, 2018, 12:33 PM IST
నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.. అందుకే వదిలేశా: స్టార్ హీరోయిన్

సారాంశం

నాకు సంబంధించిన వరకు సెక్స్ అనేది ఫిజికల్ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో కూడిన ఒక ఎమోషన్. నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా పార్ట్నర్ ను మోసం చేయలేదు. కానీ నన్ను మోసం చేసే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడంలో అర్ధం లేదనిపించింది

బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు సర్వసాధారణం. కానీ అక్కడి మీడియా మాత్రం ఈ విషయాలపై దృష్టి ఎక్కువగా పెడుతుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతంలో సోనమ్ కపూర్, కత్రినా కైఫ్, దీపికా పడుకొనే ఇలా చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు అలియా భట్ తో సన్నిహితంగా మెలుగుతూ కనిపిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దీపికా-రణబీర్ ల గురించి పలు వార్తలు వచ్చాయి.

ఆమె ఏకంగా రణబీర్ కపూర్ పేరుని రెండు అక్షరాలుగా పచ్చబొట్టు కూడా వేయించుకుంది. అంతగా ప్రేమించుకున్న జంట సడెన్ గా విడిపోయారు. బ్రేకప్ అయిన తరువాత చాలా సార్లు ఆమె రణబీర్ విమర్శలు చేసింది. కానీ ఎప్పుడూ కూడా ఎందుకు విడిపోయారని విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయింది దీపికా. రణబీర్ తనను మోసం చేశాడని బహిరంగంగానే కామెంట్స్ చేసింది. ''నాకు సంబంధించిన వరకు సెక్స్ అనేది ఫిజికల్ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో కూడిన ఒక ఎమోషన్. నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా పార్ట్నర్ ను మోసం చేయలేదు.

కానీ నన్ను మోసం చేసే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడంలో అర్ధం లేదనిపించింది. దానికంటే సింగిల్ గా ఉండడం మంచిది అనుకున్నా.. కానీ అందరూ అలా ఆలోచించరు అనుకుంటాను. అందుకే గంటలో నేను ఎక్కువగా బాధపడ్డాను. రణబీర్ నాకు రెడ్ హ్యండెడ్ గా దొరికాడు.. రెండో అవకాశం ఇవ్వమని నన్ను బ్రతిమిలాడాడు.. ప్రాథేయపడ్డాడు. కానీ మరోసారి మోసపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అతడికి దూరమయ్యాను. ఆ తరువాత మానసికంగా కుంగిపోయాను. ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి చాలా టైమ్ పట్టింది'' అంటూ చెప్పుకొచ్చింది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?