
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలున్నారు. అల్లు అర్జున్ ఏ ఈవెంట్ కు వెళ్లినా.. ఆయనతో పాటు స్నేహారెడ్డి కూడా హాజరవుతుంటుంది. ఆ విధంగా ఆమె మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తన సినిమాలకు, కుటుంబానికి సంబంధించిన విషయాలను బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు.
ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక పోస్ట్ పెట్టాడు.. లెహంగా ధరించిన తన భార్య స్నేహారెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. 'ఓ మై గాడ్.. ఇంతటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని నమ్మలేకపోతున్నాను' అంటూ పగలబడి నవ్వుతున్న ఓ ఎమోజీ పెట్టాడు. స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ స్నేహాను ఇలా అందంగా రెడీ చేశారు. తన భార్యను ఉద్దేశిస్తూ బన్నీ ఇలాంటి క్యాప్షన్ ఇవ్వడంతో అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
బన్నీ ఫోటో పెట్టిన కొద్దీ గంటల్లోనే ఈ ఫోటో 2 లక్షల డెబ్భై వేల మంది వీక్షించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'నా పేరు సూర్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. విక్రమ్ కె కుమార్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.