హైపర్ ఆదికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. 25 నిమిషాలకు గట్టిగానే ముట్టజెప్పారుగా

pratap reddy   | Asianet News
Published : Oct 13, 2021, 04:22 PM ISTUpdated : Oct 13, 2021, 04:23 PM IST
హైపర్ ఆదికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. 25 నిమిషాలకు గట్టిగానే ముట్టజెప్పారుగా

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈసారి హౌస్ లో రచ్చ ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచడం కోసమే ఈ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈసారి హౌస్ లో రచ్చ ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచడం కోసమే ఈ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిన సంగతి తెలిసిందే. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీద ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. 

ఇటీవల నవరాత్రి సెలెబ్రేషన్స్ సందర్భంగా Bigg Boss 5 Telugu స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్ లో మంగ్లీ, హెబ్బా పటేల్ లాంటి సెలెబ్రిటీల ఆటపాటలతో పాటు హైపర్ ఆది కామెడీ పంచ్ లో అలరించాయి. Hyper Aadi పోలీస్ గెటప్ లో వేదికపై హంగామా చేశాడు. నాగార్జునతో కలసి ఒక్కో కంటెస్టెంట్ ని ఆడేసుకుంటూ కామెడీ పంచ్ ల ప్రవాహం పారించాడు. 

Also Read: పెదరాయుడిలా సింహాసనంపై కూర్చుని.. అన్నయ్యకు అంత అహంకారం లేదు, నాగబాబు కామెంట్స్

ఎవ్వరినీ వదలకుండా ఒక్కో కంటెస్టెంట్ పేరు చెబుతూ హౌస్ లో వారు సీక్రెట్ గా చేస్తున్న వ్యవహారాల్ని ఇన్వెస్టిగేషన్ తో బయట పెట్టాడు ఆది. దీనితో ప్రేక్షకులకు మంచి వినోదం లభించింది. దాదాపు 25 నిమిషాల పాటు వేదికపై హైపర్ ఆది అలరించాడు. కామెడీ పంచ్ లకు ఆది పెట్టింది పేరు. అవకాశం లభించడంతో ఆది తన ట్యాలెంట్ మొత్తం బయట పెట్టాడు. జెస్సిని లస్సి తాగినట్లు తాగేస్తున్నారు అని చెప్పినా.. చివరకు నిన్ను నువ్వే కాల్చుకోవాలి అని రవితో అన్నా అది ఆదికి మాత్రమే చెల్లింది. 

మంచి వినోదం అందించిన హైపర్ ఆదికి బిగ్ బాస్ నిర్వాహకులు ఊహించని పారితోషికం అందించారు. కేవలం 25 నిమిషాల కోసం హైపర్ ఆదికి 2.5 లక్షల రెమ్యునరేషన్ అందించినట్లు టాక్. ఇది కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అనే చెప్పాలి. జబర్దస్త్ తరహాలో ఆది రెచ్చిపోయి కామెడీ పంచ్ లో పేల్చాడు. గత సీజన్ లో కూడా Samantha ఓ ఎపిసోడ్ కి హోస్ట్ గా చేసినప్పుడు హైపర్ ఆది అతిథిగా వచ్చి అలరించాడు. 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది